బిహార్ మంత్రి, ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు సంధించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. తీవ్ర వివాదాస్పదంగానూ మారాయి. తన శాఖలో ఎంతోమంది దొంగలున్నారని, వారికి తానే నాయకుడిని(సర్దార్) అంటూ ఆయన మాట్లాడిన తీరు బిహార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అక్కడితో ఆగకుండా తనపైన కూడా సర్దార్లు ఉన్నారంటూ జేడీయూ, ఆర్జేడీ అగ్రనేతలను వివాదంలోకి లాగారు.
`నా వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటీ లేదు. ఆ శాఖ నా నేతృత్వంలో నడుస్తోంది. కాబట్టి వారందరికీ నేను సర్దార్‌ను. నాపైనా ఎంతోమంది సర్దార్లున్నారు. ప్రభుత్వం మారింది. పనిచేసే తీరు మాత్రం అదే. అంతా గతంలో మాదిరిగానే ఉంది' అంటూ నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పందించారు. బిహార్ విత్తన సంఘంలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
``రైతులు అవినీతిని భరించలేక పోతున్నారు. అన్ని చోట్లా చేతులు తడపాల్సి వస్తోంది. దీనిని నేను కూడా అడ్డుకోలేక పోతున్నాను. నా దిష్టి బొమ్మను రైతులు తగలబెట్టాలని అనుకుంటున్నారు. వారికి స్వేచ్ఛను ఇవ్వండి . నా దిష్టి బొమ్మను తగల బెట్టనివ్వండి. అప్పుడైనా.. నా శాఖలో కొందరికి బుద్ధి వస్తుంది.`` అని నిప్పులు చెరిగారు.
రైతులను ఆదుకుంటామని చెప్తూ.. విత్తన సంఘం రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. 2013లో నీతీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయనపై బియ్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలుండటం గమనార్హం. బిహార్‌లో నీతీశ్ కుమార్ జేడీయూ పార్టీ ఇటీవలే బీజేపీతో బంధం తెంచుకొని.. ఆర్జేడీతో జట్టుకట్టింది. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయుధంగా మారే అవకాశం ఉందని.. అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.