తెలంగాణ మంత్రి తలసానికి ఏపీ తెలుగుదేశం నేత - టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. తమ మధ్య బంధుత్వాన్ని గుర్తు చేస్తూ.. తలసానికి హెచ్చరిక జారీ చేశారు సుధాకర్ యాదవ్. బాబుతో పెట్టుకుంటే.. 'బంధువువి అని కూడా చూసేది లేదు..' సుధాకర్ యాదవ్ వ్యాఖ్యానించడం విశేషం.
ఇటీవల తలసాని విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తలసాని ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో.. ఆయన సామాజికవర్గం వారు కొందరు ఆయనను కలిశారు. తలసాని ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు వారు సమావేశం అయ్యారు. వారిలో తెలుగుదేశం నేతలు కూడా ఉన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారి మీద సీరియస్ అయ్యారు.
బంధుత్వాలు అన్నీ ఇంట్లో పెట్టుకోవాలని.. రాజకీయంలో బంధుత్వాలకు తావు లేదని చంద్రబాబు నాయుడు వారికి గట్టిగా హెచ్చరించి చెప్పారు. తన కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని.. వారితో తను కయ్యమాడుతున్నట్టుగా.. బాబు చెప్పారు. అందరూ తనలాగే ఉండాలని ఉద్భోదించారు. ఆ బోధ సుధాకర్ యాదవ్ కు గట్టిగానే ఒంటపట్టినట్టుగా ఉంది. జాగ్రత్తగా ఉండమని.. తలసానికి హెచ్చరిక జారీ చేసేంత వరకూ వచ్చింది వ్యవహారం.
ఏపీలో బీసీలతో సభ పెట్టే ఆలోచన ఉందని ఇటీవలి కాలంలో తలసాని వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అందుకు ఏర్పాట్లకు సంబంధించి అనుమతి కోసం కూడా పోలీసులకు విన్నపాన్ని చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఈ సభకు అనుమతి జారీ కావడం లేదని తలసాని అంటున్నారు. బీసీలతో సభ పెడితే తప్పేంటని.. ఎందుకు అనుమతిని ఇవ్వరు? అని తలసాని ప్రశ్నించారు కూడా. అయితే ఆ విషయంలో ప్రభుత్వం అధికారికంగా ఏమీ స్పందించడంలేదు.
ఏదేమైనా ఏపీలో సభ పెట్టి తీరతామని ఇటీవల తలసాని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన వియ్యంకుడు స్పందించారు. బాబుతో పెట్టుకోవద్దని.. బాబు భిక్ష వల్ల తామంతా ఈ స్థాయిలో ఉన్నట్టుగా గుర్తు పెట్టుకోవాలని సుధాకర్ యాదవ్ వ్యాఖ్యానించారు. 'బాబుతో పెట్టుకుంటే వియ్యంకుడివి అని చూసేది లేదు.. కథ తేల్చడమే..' అన్నట్టుగా ఆయన హెచ్చరిక చేశారు.మరి వియ్యంకుడు ఇలా రెచ్చిపోయి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తలసాని ఎలా స్పందిస్తారో చూడాలి!