తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో గవర్నర్ తీరుపైనా సుధీర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మియాపూర్‌లో భూ కుంభకోణంపై మండిపడిన సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ తీరును తీవ్రంగా విమర్శించారు. తన కాళ్లు మొక్కేవాళ్లకే కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. టీఆర్ ఎస్ లోని నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని, వారు అవినీతికి పాల్పడుతుంటే ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన రీతిలో తప్పక స్పందిస్తారని సుధీర్ రెడ్డి తెలిపారు.
భూ కుంభకోణంపై గవర్నర్ తో కాంగ్రెస్ నేతలు సమావేశం అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన సుదీర్ రెడ్డి ఈ సందర్భంగా గవర్నర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మియాపూర్‌లో జరిగిన భారీ భూ కుంభకోణం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళితే గవర్నర్ స్పందన సరిగా లేదన్నారు. ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నేతలు వస్తే, కనీసం ఏం జరిగిందని కూడా గవర్నర్ అడగకపోవడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలపై సుధీర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ లోకి వెళ్లిన ఇద్దరు పీసీసీ మాజీ చీఫ్ లు దొంగలంటూ ఎంపీలు కేకే - డి.శ్రీనివాస్ పై సుధీర్ రెడ్డి మండిపడ్డారు. మియాపూర్ స్కామ్ లో తమ పార్టీ నేతలు ఉన్నారని వార్తలు వస్తున్నాయని, ఈ విషయంలో పార్టీ ముఖ్య నేతలు సరిగ్గా స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్య నేతలు మియాపూర్ భూ స్కామ్ పై గట్టిగా స్పందించాలని లేదా పదవులనుండి తప్పుకోవాలని సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/