చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం.. వైసీపీ నేతే కారణమా?

Update: 2022-06-07 04:20 GMT
ఏపీ అధికార పక్షానికి చెందిన నేతల 'అతి'.. ఆ పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుంది. అధికారంలో తమ పార్టీ ఉందన్న అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న నేతలు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.దీంతో నిత్యం ఏదో ఒక ఇష్యూ పంచాయితీగా మారటం.. అదో వార్తాంశంగా మారుతోంది.

వీటన్నింటి వెనుక వైసీపీకి చెందిన నేతలు ఉన్నారన్న మాట.. ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది.తాజాగా ఆ కోవలోకే వస్తుందీ ఉదంతం. చిత్తూరు జిల్లాకు చెందిన వివాహిత ఒకరు తాజాగా చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి.. తదుపరి వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ షాకింగ్ ఉదంతం వెనుక ఒక వైసీపీ నేత కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. ప్రస్తుతం అచేతన స్థితిలోకి వెళ్లి.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పేరు చిన్నాగా చెబుతున్నారు. ఆమె కుమారుడు శివతేజ మీడియాతో మాట్లాడారు.

తమ తండ్రి వెంకటేశ్ తో విభేదాలు ఏర్పడిన తర్వాత తనను.. తన చెల్లిని తీసుకొని అమ్మ విడిగా ఉంటున్నట్లు చెప్పారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన తగదా ఏర్పడిందని.. దానికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని చెప్పాడు.

ఈ నేపథ్యంలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని అగరమంగళానికి చెందిన అంకాళ పరమేశ్వరి దేవస్థానం ఛైర్మన్.. పారిశ్రామికవేత్త అయితే దీపక్ కుమార్ కొనుగోలు చేశారన్నారు. తమ ప్రమేయం లేకుండా తమకు చెందిన ఆస్తిని ఎలా కొంటారని తన తల్లి ప్రశ్నించటంతో రౌడీలతో బెదిరించారన్నారు. దీంతో.. దీని వెనుక ఎవరున్నారన్న విషయాన్ని ఆరా తీస్తే వైసీపీకి చెందిన విజయేందర్ అనే నేత ఉన్నట్లుగా బయటకు వచ్చిందని తెలిపారు.

దీంతో.. సదరు వైసీపీ నేతపై జూన్ ఒకటో తేదీన జీడీనెల్లూరు ఎస్ఐ కు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదుని.. అందుకే కలెక్టరేట్ కు వచ్చామని.. జరుగుతున్న పరిణామాలతో ఆవేదన చెందిన తన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు. దీనిపైఅధికారిక యంత్రాంగం ఇంకా స్పందించాల్సి ఉంది.
Tags:    

Similar News