బడాయి మాటలు చెప్పుకునే చంద్రబాబుతో సహా.. టీడీపీ నేతలకు భారీ షాక్ తగిలే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పవర్‌లోకి వచ్చిన పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల మీద తీవ్రసంతృప్తి వ్యక్తం చేస్తూ.. టీడీపీ అనుబంధ సంస్థలో పని చేసిన నేత ఒకరు ఆత్మహత్య చేసుకోవటం.. అది కూడా సేవ్ టీడీపీ అని పేర్కొనటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
కృష్ణా జిల్లాలోని జి. కొండూరు మండలం గడ్డమడుగుకు చెందిన అప్పసాని ఈశ్వర్ గతంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన మాజీ. తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగమైన ఈ సంస్థలో కీలక భూమిక పోషించిన ఈశ్వర్.. తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. పార్టీ కోసం రాత్రిబవంళ్లు కష్టపడుతున్న వారిని పట్టించుకోవటం లేదని.. వారికి గుర్తింపు లభించటం లేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు.
పార్టీ కోసం జీవితాంతం పని చేసిన తనకు పదవులు రాకున్నా ఫర్లేదని.. ఆ విషయంలో తాను బాధ పడలేదని.. కానీ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారు.. ఇప్పుడు మాత్రం పార్టీలో చేరటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఒకప్పుడు పార్టీకి నష్టం వాటిల్లేలా చేసిన వారే.. ఇప్పుడు పార్టీలో చేరిన వైనాన్ని తప్పు పట్టిన ఆయన.. దీని నుంచి పార్టీని రక్షించాలని కోరారు. ఇందుకు సంబంధించిన సూసైడ్ లేఖను రాసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
తెలుగుదేశం పార్టీని రక్షించండంటూ కోరిన ఈశ్వర్ ఆత్మహత్య ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కోసం అంతలా కష్టపడి.. ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఈ తెలుగు తమ్ముడు పార్టీ అధినేత కుమారుడు లోకేశ్ కు కూడా సూసైడ్‌లేఖ పంపటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/