మిస్టరీగా మారిన ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య?

Update: 2021-10-29 04:48 GMT
ఒకే రోజు ఒకేలా చని పోయిన ముగ్గురు స్నేహితురాళ్ల వ్యవహారం ఇప్పుడు షాకింగ్ మిస్టరీ గా మారింది. అసలేం జరిగిందన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్న. చిన్న తనం నుంచి కలిసి పెరిగిన ఈ ముగ్గురు అమ్మాయి ల్లో ఇద్దరి కి ఈ మధ్యనే పెళ్లి కావటం గమనార్హం. జగిత్యాల లో సంచలనం గా మారిన ఈ ఉదంతం లోకి వెళితే.. జగిత్యాల శివారు లోని ఉప్పరి పేటకు చెందిన గంగాజల (19).. మల్లిక (19).. వందన (16)లు చిన్నతనం నుంచి స్నేహితురాళ్లు మాత్రమే కాదు బంధువులు కూడా. ఇదిలా ఉంటే ఈ ముగ్గురి లో గంగాజల.. మల్లిక కు రెండు నెలల క్రితమే పెళ్లైంది. వందన మాత్రం ఇంటర్ చదువుతోంది.

ఇదిలా ఉంటే.. మల్లిక కు అనారోగ్యం గా ఉన్న కారణం గా ఆమెను తండ్రి పది రోజుల క్రితం అత్తారింటి నుంచి పుట్టింటి కి తీసుకొచ్చారు. ఆసుపత్రి కి తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే వారం క్రితం గంగాజల కూడా అత్తారింటి నుంచి అమ్మ గారింటికి వచ్చింది. బుధవారం సాయంత్రం ఈ ముగ్గురు స్నేహితురాళ్లు షాపింగ్ కు వెళుతున్నామంటూ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. రాత్రి అయినా రాలేదు. దీంతో.. ఆందోళన కు గురైన వారి తల్లిదండ్రులు వారి కోసం వెతకటం ప్రారంభించారు.

గురువారం వారి లో ఇద్దరి డెడ్ బాడీలు పట్టణ శివారు చెరువు లో కనిపించాయి. మరో రెండు గంటల తర్వాత మూడో అమ్మాయి డెడ్ బాడీ బయట కు వచ్చింది. దీం తో.. ఈ ముగ్గురు ఎలా చనిపోయారు? కారణం ఏమిటి? ప్రమాదవ శాత్తు చనిపోయారా? లేదంటే.. ఆత్మ హత్య చేసుకున్నారా? ఇద్దరు చెరువు లో మునుగుతుంటే.. వారిని రక్షించే ప్రయత్నంలో మూడో అమ్మాయి కూడా చనిపోయిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే మరణించిన ముగ్గురి లో మల్లిక.. గంగాజల తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెల కు అనారోగ్యంగా ఉంటోందని.. ఈ కారణం తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా.. తన ఇద్దరు స్నేహితురాళ్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. వారిని రక్షించే ప్రయత్నం లో తన కుమార్తె నీళ్ల లో పడి చనిపోయి ఉంటుందని తాము భావిస్తున్నట్లుగా వందన తండ్రి తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ముగ్గురు అమ్మాయి మరణాల మీద మరింత లోతు గా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News