కేంద్రంలో మోడీ మళ్లీ గెలుస్తాడని.. చంద్రబాబు ఆయన అనుకూల మీడియా అస్సలు ఊహించలేదు. అందుకే ఎన్నికల ముందర మోడీకి వ్యతిరేకంగా బాబు బ్యాచ్ బాగానే డ్యామేజ్ చేసింది. కానీ మోడీ గెలవడంతో టీడీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయిందంటారు. అందుకే బీజేపీకి అవసరమైన నలుగురు రాజ్యసభ సభ్యులను చంద్రబాబు పువ్వుల్లో పెట్టి మరీ సాగనంపారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఎంపీలు సుజనా, సీఎం రమేశ్ లు బ్యాక్ బోన్ గా ఉండేవారు. టీడీపీకి ఆర్థిక అండదండలు ఇచ్చిన వీరు బీజేపీలోకి చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే చంద్రబాబే సాగనంపారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగింది. తనకు బీజేపీ నుంచి సాయం అందడానికి మళ్లీ బీజేపీ-టీడీపీ బంధం బలపడాలే చేసేందుకే చంద్రబాబు తన నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీకి పంపారనే టాక్ ఉంది. కానీ అదంతా ఇప్పుడు వృథా ప్రయాస అయిపోయింది.
సుజనా బీజేపీ ఆటలో అరటిపండుగా మారాడనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. టీడీపీ నుంచి జంప్ అయిన ఎంపీలను ఇప్పుడు బీజేపీ హైకమాండ్ పట్టించుకోవటం లేదట.. సుజనా చౌదరి అమరావతినే ఏపీ రాజధానిగా ఉంచాలని.. మార్చవద్దని పెద్ద ఉద్యమమే చేశాడు. బీజేపీలో ఉండే ఇలా గళమెత్తాడు. హైకమాండ్ అంతా చూస్తోందని సుజనా బెదిరించాడు.
కానీ స్వయంగా కేంద్రం స్పందించింది. ఏపీ రాజధాని విషయంలో తాము ఇన్ వాల్వ్ అవ్వమని కేంద్రం హైకోర్టులో స్పష్టం చేసింది.. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని కుండబద్దలు కొట్టింది. ఈ ప్రకటన తర్వాత సుజనా చౌదరి నుంచి ఒక మాట రాలేదు. సుజనా సైలెంట్ అయ్యాడు.
చంద్రబాబు అమరావతిపై ఇన్నాళ్లు భరోసాగా ఉన్నాడు.. మన టీడీపీ ఎంపీలంతా బీజేపీలో ఉన్నారు కదా వాళ్లు ఈ విషయంలో చూసుకుంటారని భావించాడు. అమరావతిలో పెట్టుబడులు కూడా భారీగా టీడీపీ నేతలు పెట్టడంతో సుజనా చౌదరి సహా సీఎం రమేశ్ లు ఏదో చేస్తారని టీడీపీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు వీళ్లు ఏం చేయలేరని తేలిపోవడంతో చంద్రబాబు సహా టీడీపీ నేతలు నెత్తి నోరు కొట్టుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తానికి సుజనా ఆటలో అరటిపండు మాత్రమేనని టీడీపీ నేతలకు జ్ఞానబోధ అయినట్టు ఆ పార్టీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.