కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గురువారం వెళ్లటం తెలిసిందే. శుక్రవారం ఉదయం రాజ్‌నాథ్‌తో భేటీ కోసం గవర్నర్‌సాబ్ గురువారం సాయంత్రం బయలుదేరి వెళ్లటం కాస్తంత ఆసక్తిని రేకెత్తించింది.
అయితే.. భేటీ జరిగేది హోంమంత్రితో కాబట్టి.. విమానం కానీ ఏదైనా లేటు అయితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశ్యంతో ముందుజాగ్రత్తగా ముందే వెళ్లారని పలువురు భావించినా.. గురువారం రాత్రి.. కేంద్రమంత్రి.. తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరీ భేటీ కావటం గమనార్హం. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు సెక్షన్ 8 అంశంపై కేంద్రం గవర్నర్‌ని పిలిపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. గవర్నర్‌సాబ్‌తో సుజనా భేటీ కావటం కాస్తంత విశేషమే.
ఈ భేటీ అధికారికమా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ.. రాత్రివేళ గవర్నర్‌ను చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా కలవటం కాస్తంత ఆసక్తికరమేనన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి భేటీల కోసమే గవర్నర్ ముందే బయలుదేరి వెళ్లారన్న మాట కూడా వినిపిస్తోంది. మరి.. ఈ విషయాల మీద ఏ రాజకీయ పార్టీ అయినా స్పందిస్తుందేమో చూడాలి.