తెలుగుదేశం పార్టీలో సుజనాచౌదరి ఎదుగుదల తెలియంది కాదు... రాకెట్ స్పీడుతో ఆయన అందరినీ దాటి వెళ్లిపోతున్నారు. దీనంతటికీ చంద్రబాబునాయుడి అండదండలే కారణమని అందరికీ తెలుసు. తన ఎదుగుదలకు కారణమైన బాబును పొగడడంలో సుజనా ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన విజయవాడలో మాట్లాడుతూ మరోసారి చంద్రబాబును పొగడ్డల్లో ముంచెత్తారు. క్లిష్ఠ సమయంలో ఎపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడం ఎంతో అదృష్టమని ఆయన అంటున్నారు. టిడిపి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్న క్రమంలో కొందరు ప్రభుత్వ ఖర్చులపై విమర్శలు చేయడం కరెక్టు కాదంటూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు రాష్ట్ర ఆదాయం పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు.ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టి ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగపడేలా చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎపికి సహకరిస్తున్నదని సుజనా చౌదరి చెప్పారు. ఎస్.సి,ఎస్.టి వర్గాల వారు ప్రభుత్వ పధకాలను వాడుకుని అబివృద్ది చెందాలని అన్నారు.ఎపి నాలుగేళ్లలో అబివృద్ది చెందాలని అనుకున్నా, అంతకన్నా ముందుగానే రెండేళ్లలోనే అబివృద్ది చెందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే.... టీడీపీలోనే సుజనా అంటే పీకల్దాకా కోపం ఉన్నవారు మాత్రం చంద్రబాబు ఏపీ సీఎంగా ఉండడం మిగతా అందరికీ ఏమో కానీ సుజనాచౌదరికి మాత్రం అదృష్టమేనని సెటైర్లు వేస్తున్నారు.