ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో టీడీపీ ఎంపీ- కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి ఆసక్తికరమైన వార్తను వెల్లడించారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడానికి సంబంధించిన కేంద్రం సర్వం సిద్ధం చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా కేబినెట్ నోట్ సిద్ధంగా ఉన్నట్టు సుజనా చౌదరి వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో టీడీపీ ఎంపీల పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో సుజనా మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించామన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు ఆర్థికంగా సాధ్యం కాదని అధికారులు చెప్పింది వాస్తవమేనని అంగీకరించారు. ప్రజల భావోద్వేగానికి రైల్వే జోన్ ఇవ్వాల్సిందే...ఇస్తారనే నమ్మకం కూడా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని సుజనా చౌదరి తెలిపారు. పెండింగ్ అంశాలపై ఎంపీలు బృందాలుగా కేంద్రమంత్రులను కలవాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.
ఏపీ - తెలంగాణలో శాసనసభ నియోజక వర్గాలు పునర్ విభజన - సీట్ల పెంపుకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని సుజనా చౌదరి వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని రేపు కలిసి ఏపీ ప్యాకేజీ చట్టబద్ధతకు కేబినెట్ ఆమోదంపై చర్చిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వ నోట్ సిద్ధం అయిందన్నారు. త్వరలో ఇది ఆమోదం పొందనున్నట్లు సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/