బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడానికి అన్ని అడ్డంకులూ తీరిపోయాయి. వారు టీడీపీ కండువా కప్పుకోవడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. టీడీపీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. వరుసగా మూడుసార్లు బొబ్బిలి నుంచి సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో జిల్లా నేత - మంత్రి బొత్స సత్యనారాయణతో విభేదాలు ఉండడంతో ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులను అందుకోలేకపోయారు. అనంతరం వైకాపాలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా గెలుపొందినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో రాజుల ఆశ నెరవేరలేదు. పైగా బొత్స సత్యనారాయణ కూడా కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి రావడంతో రాజులు ఆలోచనలో పడ్డారు. దీంతో పార్టీ మారాలని కొంతకాలంగా యోచిస్తున్నట్లు సన్నిహితులు చెబుతూ వచ్చారు. ఇలాంటి వార్తలను ఖండిస్తూ వచ్చిన ఎమ్మెల్యే, ఆయన సోదరుడు బేబినాయన తాజాగా తెదేపాలోకి వస్తే నియోజకర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారపార్టీ పెద్దలతో మంతనాలు జరిపి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
బొబ్బిలి కోటలో బుధవారం రాత్రి టీడీపీ ముఖ్యులతో ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు సంప్రదింపులు జరిపారు. పార్టీ మారితే మంచిదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ మారాల్సి వస్తోందని ముఖ్యులతో ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చెప్పినట్లు సమాచారం. తెదేపా అధికారంలో ఉండడంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందని, ఆ పార్టీ కూడా తన సేవలను గుర్తిస్తోందని ఎమ్మెల్యే పేర్కొనడంతో అందరూ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా బొబ్బలి రాజుల చేరికను విజయనగరం టీడీపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఒకటి రెండు రోజుల్లో చేరే అవకాశముందన్నారు.
మరోవైపు విజయనగరం టీడీపీకి విజయనగరం రాజు అశోక్ పెద్ద దిక్కుగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనకు రాష్ట్రం - కేంద్రంలో మంచి పలుకుబడి ఉంది. అయితే.. బొబ్బలి - విజయనగరం రాజులకు చారిత్రక వైరం ఉంది. ఆ ప్రభావం ఇటీవల కాలం వరకు రెండు రాజకుటుంబాల మధ్య కనిపించేది... కానీ, మారుతున్న పరిస్థితుల్లో శత్రురాజులిద్దరూ ఇప్పుడు టీడీపీలోనే కలిసి పనిచేయబోతున్నారు. బొబ్బిలి రాజులు - అశోక్ మధ్య ఇటీవల మంచి వాతావరణం కూడా నెలకొంది. అశోక్ అన్న ఆనందగజపతి మృతి అనంతరం బొబ్బిలిరాజులు వచ్చి అశోక్ ను పలకరించడమే కాకుండా ఆత్మీయంగా మాట్లాడారు. ఇదంతా శుభపరిణామంగా భావిస్తున్నారు. కాగా, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన సోదరుడు బేబీనాయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని వినిపిస్తోంది. ప్రజల్లో మంచి పేరున్న సుజయ కృష్ణ... కార్యకర్తలు - జనాలతో కలిసిపోయే, రాజకీయ వ్యూహాల్లో దిట్టయిన ఆయన తమ్ముడు బేబీనాయనలు టీడీపీలో చేరితే విజయనగరం జిల్లా టీడీపీకి కంచుకోటే కానుంది.
కొసమెరుపు: నాలుగు నెలల క్రితం సుజయకృష్ణ రంగారావు - బేబినాయనలు పార్టీ మారుతారని ప్రచారం మొదలైనపుడు పార్టీ నుంచి విజయసాయి రెడ్డి - పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరబధ్రస్వామి తదితరులు వచ్చి రాజులతో చర్చించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి అన్నది లేకుండా గెలుస్తున్న సుజయ్ కృష్ణ రంగారావు సోదరులు టీడీపీలో ఆ పార్టీలో చేరుతుండడం ఇరు పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది.