రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై కొన్నాళ్లుగా జైల్లో ఉంటున్న సుఖేష్ చంద్రశేఖర్.. రైల్వే శాఖకు ఓ లేఖ పంపాడు. ఇటీవల ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందిస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆ విరాళాన్ని అంగీకరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరాడు.
అవును... ఆర్థిక నేరాల్లో అరెస్టై జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. ఇప్పుడు ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వానికి తన వంతు సాయం చేస్తానంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా రైల్వే శాఖకు ఏకంగా రూ.10 కోట్ల విరాళం ఇస్తానని చెబుతున్నాడు. తన విరాళానికి సంబంధించి కేంద్రానికి ఒక లేఖ కూడా రాశాడు.
తన వ్యక్తిగత నిధుల నుంచి, పన్ను చెల్లించిన డబ్బు నుంచే విరాళంగా ఇస్తున్నానని, వాటిని స్వీకరించాలంటూ విజ్ఞప్తి చేశాడు. విరాళాన్ని పంపేందుకు సంబంధిత డిపార్ట్ మెంట్ వివరాలను పంపాలని కోరాడు. తక్షణమే డిమాండ్ డ్రాఫ్ట్ ను తయారుచేసి రూ.10కోట్ల విరాళాన్ని పంపిస్తానని తెలిపాడు. ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు, రిటర్నుల వివరాలను కూడా డీడీతో పాటు అందజేస్తానని చెప్పాడు.
ఈ సందర్భంగా బలాసోర్ రైలు ప్రమాదాన్ని దురదృష్టకర దుర్ఘటనగా అభిప్రాయపడిన సుఖేష్.. మోడీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తానిచ్చే రూ. 10 కోట్లను బాధిత కుటుంబాల పిల్లల విద్యా ఖర్చుల కోసం వినియోగించాల్సిందిగా కేంద్రాన్ని కోరాడు. నిరుపేదలకు సహాయం చేయడం పౌరుడిగా, ఆర్థిక సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా తన బాధ్యత అని సుఖేష్ ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.
ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 288 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 1100 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
కాగా... గత కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ సుఖేష్ మీడియాకు లీకులిచ్చిన సంగతి తెలిసిందే. బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత ను అక్క అంటూ సంభోదిస్తూ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని సైతం టార్గెట్ చేస్తూ వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్స్ ని విడుదల చేస్తూ సంచలనాలు సృష్టించాడు. అప్పట్లో ఈ లీకులు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే!