మండ్య నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నటి సుమలత విజయం మీద ధీమాతో కనిపిస్తున్నట్టుగా ఉన్నారు. ఆమె విజయం సాధించడం ఖాయమని ఇతర పార్టీల వాళ్లు కూడా ఆమెకే చెబుతున్నారట. ఏవైనా ప్రోగ్రామ్స్ ఆమెకు ఎదురుపడిన వాళ్లు ఆ విషయాన్ని చెబుతున్నారట. 'జయం మీదే..'అని ఆమెతో అంటున్నారట సీనియర్ పొలిటీషియన్లు.
మండ్యలో ఎన్నికల ముందు సమీకరణాలను బట్టి అలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక అదే ధీమాతో సుమలత కూడా విజయాన్ని ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఇటీవలే ఆమె ఒక విందును ఏర్పాటు చేసిందట. తన విజయం కోసం సహకరించిన వారికి ఆమె ఆ విందును ఇచ్చిందని సమాచారం.
ఆ విందుకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా పిలిచిందట సుమలత. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముందుగా సుమలత కాంగ్రెస్ పార్టీ టికెట్ నే ఆశించారు. అయితే కాంగ్రెస్ వాళ్లు ఆ సీటు జేడీఎస్ కు ఇచ్చేసినట్టుగా ప్రకటించారు. పై స్థాయి నేతలు అలా చేతులు దులిపేసుకున్నారు.
అయితే కింది స్థాయి వాళ్లు జేడీఎస్ విజయం కోసం పని చేయలేకపోయారు. ఎందుకంటే మండ్యలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జేడీఎస్ వార్ చాలా పాతదే. దీంతో ఇప్పుడు క్షేత్ర స్థాయి నేతలు, కార్యకర్తలు జేడీఎస్ కోసం పని చేయలేకపోయారు. అంబరీష్ కాంగ్రెస్ నేతగా వారందరికి సుపరిచితుడే. ఆయన భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేసే సరికి కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆమెకే సపోర్ట్ చేసింది.
వారు సుమలత ఇచ్చిన విందుకు కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న కుమారస్వామి తీవ్రంగా అసహన భరితుడు అయ్యారట. మండ్య నుంచి కుమారస్వామి తనయుడు పోటీ చేసిన సంగతి తెలిసిందే. తన తనయుడి విజయం కోసం సహకరించలేదని ఆయన కాంగ్రెస్ నేతల మీద తీవ్రంగా అసహనభరితుడు ఉన్నారని సమాచారం. ఇప్పుడు సుమలత విందుకు కూడా మండ్య కాంగ్రెస్ నేతలు హాజరు కావడం పై ఆయన మరింత అసహన భరితుడు అయ్యారని వార్తలు వస్తున్నాయి.