సీఎం కుమారుడికి షాక్.. ఓడిపోతాడట..

Update: 2019-05-21 09:08 GMT
దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. దేశంలో - రాష్ట్రంలో ఎవరు  గెలుస్తారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సీట్లను గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న మాండ్యా లోక్ సభ సీటుపైన ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్ గా చెప్పేశాయి.

మాండ్యా నుంచి బరిలోకి దిగిన దివంగత సూపర్ స్టార్ అంబరీష్ భార్య సుమలత గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తాజాగా కుండబద్దలు కొట్టాయి. ఇక్కడ ఆమెపై పోటీచేసిన కర్ణాటక సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ ఓడిపోతాడని పేర్కొన్నాయి.

అంబరీష్ చనిపోయాక.. ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు సుమలత ఆయన స్వస్థలమైన మాండ్యా నుంచి పోటీచేసేందుకు ముందుకువచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. జేడీఎస్ కు కేటాయించింది. దీంతో జేడీఎస్ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ ను బరిలో దింపింది. అయితే సుమలత ఊరుకోకుండా ఇండిపెండెంట్ గా మాండ్యా నుంచి బరిలోకి దిగింది. ఆమెకు బీజేపీ మద్దతు ప్రకటించగా.. కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా సహకరించారన్న వార్తలు వచ్చాయి..

ఓ వైపు సీఎం కుమారస్వామి.. మరోవైపు సుమలత ప్రచారం దేశవ్యాప్తంగా కాక రేపింది. కుమారస్వామి తన శక్తియుక్తులంతా ప్రయోగించి సుమలతను - ఆమెకు తోడు ప్రచారానికి వచ్చిన హీరోలు యష్ - దర్శన్ లను బెదిరించినా వెనక్కితగ్గలేదు. తాజాగా ఎగ్జిట్ పోల్స్ లో సైతం ఆమెకే ఓటర్లు పట్టం కడుతున్నారని తెలియడంతో సుమలత శిబిరం ఆనందం వ్యక్తం చేస్తోంది.

అంబరీష్ పై అభిమానం.. కుల సమీకరణాలు - సుమలతపై సానుభూతి - కాంగ్రెస్ అంతర్గత సపోర్ట్ వల్లే సుమలత గెలుస్తోందని సమాచారం.  ఇక సీఎం కుమారస్వామి కుమారుడి ఓటమి అని తెలిసి అధికార జేడీఎస్  షాక్ కు గురవుతోంది.


Tags:    

Similar News