కర్ణాటకలో అధికార జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగలనుంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వీడీపీ అసోసియేషన్ (నేషనల్ ట్రాకర్ పోల్) సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది.
కర్ణాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలనుందని పీడీపీ సర్వే స్పష్టం చేసింది. ఇక సుమలత పోటీచేస్తున్న మాండ్యా నియోజకవర్గంలో ఆమె విజయం సాధిస్తుందని.. ఆమెపై పోటీకి దిగిన సీఎం కుమారుడు నిఖిల్ చిత్తుగా ఓడిపోతాడని సర్వే స్పష్టం చేసింది.
ఇక కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా వీడీపీ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 232 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నాయకులు కష్టపడితే 250 సీట్లకు పెరుగుతుందని వీడీపీ అంచనావేసింది.
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 21 లోక్ సభ నియోజకవర్గాల్లో జేడీఎస్ పార్టీ 7 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నాయి. సర్వే ప్రకారం.. కర్ణాటకలో బీజేపీకి 17 సీట్లు.. కాంగ్రెస్ 8 సీట్లు, జేడీఎస్ 2 సీట్లు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు కలిసి పోటీచేసినా బీజేపీకి ఎక్కువ లాభం కలుగుతుందని.. ఆ పార్టీకి 17 సీట్లు వస్తాయని వీడీపీ సర్వే తెలిపింది.
కాంగ్రెస్ టికెట్ ను ఆశించి ఇవ్వకపోవడంతో దివంగత అంబరీష్ భార్య సుమలత మాండ్యాలో స్వతంత్రంగా పోటీచేస్తున్నారు. ఆమెకు బీజేపీ, కర్ణాటక రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో ఆమెపై పోటీకి దిగిన సీఎం కుమారుడు నిఖిల్ పై ఈజీగా గెలుస్తుందని సర్వేలో తేలింది. అంబరీష్ సెంటిమెంట్ , ఆయన చేసిన పనులే గెలిపిస్తాయని తేలింది.
వీడీపీ సర్వే ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ కు 39.9శాతం ఓట్లు, జేడీఎస్ కు 14.1శాతం, బీజేపీకి 45.2శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.