రాజకీయాల్లోకి మరో అగ్రనటుడు

Update: 2017-04-23 05:08 GMT
రాజ‌కీయాల్లోకి మ‌రో ప్ర‌ముఖ న‌టుడు ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఈ మేరకు స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించాడు. ఆ ప్ర‌ముఖ న‌టుడే ఒక‌నాటి టాప్ హీరో సుమ‌న్‌. ఓ పాఠశాల భవన ప్రారంభానికి ఒంగోలు వెళ్లిన సంద‌ర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ త్వరలో రాజకీయ రంగంలో కాలు మోపేందుకు సిద్ధమవుతున్నానని సుమన్‌ తెలిపారు. 2019 ఎన్నికల నాటికి తన రాజకీయ అరంగేట్రం ఉంటుందన్నారు. ఏ పార్టీ తరపున పోటీకి సిద్ధమయ్యేదీ ఇప్పుడే చెప్పలేనని సుమన్ అన్నారు.

ప్రజా సమస్యలు తీర్చగలిగిన శక్తిమంతులకు తాను మద్దతు పలుకుతానని సుమ‌న్ తెలిపారు. అటువంటి పార్టీనే ఎంపిక చేసుకుని పోటీ చేస్తానని ఆయ‌న చెప్పారు. ఇప్పటికే తాను పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నానని వివరించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర‌-ద‌క్షిణ భార‌త‌దేశ రాజ‌కీయాల గురించి సుమ‌న్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి ఉత్త‌ర భార‌తానికి చెందిన వ్య‌క్తి చేప‌ట్టినందున దక్షిణ భారతదేశానికి ఉప ప్రధాని పదవి ఇస్తే బాగుండేదని సుమ‌న్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News