భార్య మృతి కేసు నుంచి శశిథరూర్ బయటపడతారా?

Update: 2021-03-27 06:30 GMT
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్ భార్య సునంద పుష్క‌ర్ 2014 జ‌న‌వ‌రి 17న ఓ హోట‌ల్ లో మృతిచెందారు. అయితే.. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని శ‌శిథ‌రూర్ త‌ర‌పు లాయ‌ర్ వాదిస్తుండ‌గా.. అది ఖ‌చ్చితంగా హ‌త్యేనంటున్నారు సునంద త‌ర‌పు బంధువులు. ఎంతో కాలంగా సాగుతున్న ఈ కేసు విచార‌ణ‌.. తాజాగా శుక్ర‌వారం కోర్టు ముందుకు వ‌చ్చింది.

ఢిల్లీ న్యాయ‌స్థానంలో విచార‌ణ‌కు హాజ‌రైన సునంద బంధువులు.. ఆమెది హ‌త్యేన‌ని వాదించారు. ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని, సునంద పుష్క‌ర్ చాలా దృఢ‌మైన మ‌నిషి అని కోర్టుకు తెలిపారు.

అయితే.. హ‌త్య జ‌రిగింద‌న‌డానికి ఎలాంటి ఆధారాలూ లేవ‌ని శ‌శిథ‌రూర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. క‌నీసం అద‌న‌పు క‌ట్నం, ఇత‌ర వేధింపులు జ‌రిగిన‌ట్టు కూడా ఒక్క ఆధారం కూడా లేద‌ని లాయ‌ర్ వాదించారు. అంత‌కు ముందు వాయిదాలో.. సునంద ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చెప్ప‌డానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవ‌ని ఆమె కుటుంబ స‌భ్యుల త‌ర‌పు లాయ‌ర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితి ప్ర‌కారం కేసు తుది ద‌శ‌కు వ‌చ్చింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి, న్యాయ‌స్థానం ఎలాంటి తీర్పు చెప్ప‌బోతోంది? ఈ కేసు నుంచి శ‌శిథ‌రూర్ బ‌య‌ట‌ప‌డ‌తారా? లేదా? అనే చ‌ర్చ కొన‌సాగుతోంది.
Tags:    

Similar News