అతను సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రపంచాన్ని ఇట్టే ప్రభావితం చేసే శక్తివంతమైన టెక్ కంపెనీకి సీఈవో. అలాంటి వ్యక్తికి నిద్ర లేని రాత్రులు ఉంటాయా? అంటే ఆశ్చర్యపోతాం. కానీ.. ఆయన చెప్పిన తాజా మాటలు విన్నంతనే నిజమే కదా.. అన్న భావన కలగటం ఖాయం. అంతేకాదు.. ప్రపంచానికి షాకిచ్చేలా ఆయన మాటలున్నాయి. అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతను చూసి మురిసిపోవటం కాదు.. వాటితో పొంచి ఉన్న ముప్పు గురించి చెప్పి.. ఒళ్లు జలదరించేలా చేసిన సుందర్ పిచాయ్ మాటలు ఇప్పుడు అందరూ ఎంతో శ్రద్ధగా వినటమే కాదు.. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఖాయమని చెప్పాలి.
ఇప్పుడు అందరి నోట తరచూ వినిపించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తెలుగులో చెప్పాలంటే కృత్రిమ మేధ. మనిషికి ఉండే మేధకు కొన్ని వందల రెట్లు శక్తివంతంగా తయారు చేసేందుకువీలుగా సాగుతున్న ప్రయోగాలతో వచ్చిన ఫలితాల్లో ఈ కృత్రిమ మేధ ఒకటి. కానీ.. దీన్ని సరైన పద్దతిలో వాడుకోకుండా.. తప్పుడు విషయాలకు వాడితే ప్రమాదకర పరిణామాలు ఉంటాయన్నహెచ్చరికను చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన చెప్పిన మాటల్ని ప్రపంచం కాస్తంత జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తును ముందే దర్శించినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. కృత్రిమ మేధ గురించి చెప్పిన ఆయన.. ''కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకుంటే హానికారమైన పరిణామాలు తప్పవు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కృత్రిమ మేధ మీద నియంత్రణ ఉంచాల్సిందే. ఏఐ కారణంగా చోటు చేసుకునే దుష్ప్రభావాలను తలుచుకుంటే నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. అందుకే, కృత్రిమ మేధను సరైన రీతిలో వినియోగించుకోవాటినికి వీలుగా ప్రభుత్వాలు తక్షణమే ఫోకస్ చేయాలి'' అని వ్యాఖ్యానించారు.
సరైన రీతిలో కృత్రిమ మేధను వాడకుంటే చాలా హాని కారమని.. వాటికి సమాధానాలు మన దగ్గర లేవన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ మేధ గురించి తలుచుకుంటే రాత్రిళ్లు మేల్కొనాల్సి వస్తుందా? అని అడిగితే తన సమాధానం కచ్ఛితంగా అవుననే మాట వినిపిస్తోందని చెప్పటం గమనార్హం. కొత్త టెక్నాలజీని అత్యంత వేగంగా తీసుకొచ్చేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయన్న సుందర్ పిచాయ్.. ఏఐతో అసత్య సమాచారాన్నీ రూపొందించే వీలుందన్న విషయాన్ని వెల్లడించారు.
'ఇది సమాజానికి ప్రమాదకరం. ఇలా కృత్రిమ మేధ టెక్నాలజీ పెరిగే కొద్దీ.. వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఒక అంతర్జాతీయ కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని.. అణ్వాయుధాల కార్యాచరణ మాదిరే ఇది కూడా ఉండాలన్న కీలక సూచనను ప్రపంచానికి చేయటం గమనార్హం. కృత్రిమ మేధ సాంకేతికతో వస్తున్న చాట్ జీపీటీ లాంటి కొత్త వ్యవస్థలు సమాజానికి.. యావత్ మానవాళికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ తరహా వ్యవస్థల్ని నిలిపి వేయాల్సిన అవసరం ఉందని రాసిన లేఖలో ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖులు సైతం సంతకాలు చేయటాన్ని ప్రస్తావిస్తున్నారు. సుందర్ పిచాయ్ చెప్పిన మాటలు ప్రపంచానికి ఒక హెచ్చరిక మాత్రమే కాదు.. కొత్త సాంకేతికత వస్తుందన్నంతనే సంతోష పడే కన్నా.. వాటి ద్వారా మానవాళికి ఏమైనా నష్టం వాటిల్లుతుందా? అన్న విషయాన్ని క్రాస్ చేసుకోవాల్సిన అవసరం ఆయన చెప్పిన తాజామాటల్ని వింటే కలుగక మానదు.