జీతమే ఎక్కువ ఇస్తున్నారంటూ రూ.405కోట్లు వ‌ద్ద‌న్నాడు!

Update: 2019-05-31 05:17 GMT
జీతం ఎంత ఇస్తున్నా.. చేస్తున్న ప‌నికి త‌గ్గ జీతం ఇవ్వ‌టం లేద‌న్న అసంతృప్తి కోట్లాది మందిలో ఉండేదే. అలాంటిది మీరు బాగా ప‌ని చేస్తున్నారు.. మీకిచ్చే జీతానికి అద‌నంగా ఇంత‌ ఇన్సెంటివ్ తీసుకోండంటే హ్యాపీగా తీసేసుకుంటారు ఎవ‌రైనా. అందులోకి అలా ఇచ్చే మొత్తం రూ.405 కోట్లు అయితే.. వ‌దులుకోవ‌టానికి ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ‌తారా?  కానీ.. గూగుల్ సీఈవో క‌మ్ తెలుగోడు సుంద‌ర్ పిచాయ్ మాత్రం అందుకు భిన్నం.

త‌న జీతానికి అద‌నంగా ఇస్తామంటూ గూగుల్ ఇవ్వ‌బోయిన ఇన్సెంటివ్ ను వ‌ద్ద‌నేశాడు. అంతేనా.. ఇప్ప‌టికే మీరిస్తున్న జీతం ఎక్కువ‌.. మ‌ళ్లీ ఇన్సెంటివ్ ఒక‌టా?  నో అంటే నో అనేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. గూగుల్ సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న సుంద‌ర్ పిచాయ్ శాల‌రీ ప్ర‌పంచంలోని అత్య‌ధిక వేత‌నం అందుకునే సీఈవోల జీతాల్లో ఒక‌టిగా చెబుతారు.

ఆయ‌న‌కు వార్షిక జీతం కింద రూ.1300 కోట్లు వ‌స్తాయి. ఈ ఏడాది ఆయ‌న జీతాన్ని మ‌రింత పెంచ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ప‌నిలో ఆయ‌న చూపించిన ప్ర‌తిభ‌కు మెచ్చిన గూగుల్‌.. ఆయ‌న‌కు ఈ ఏడాది రూ.405 కోట్ల ఇన్సెంటివ్ ను ప్ర‌క‌టించింది. అయితే.. ఆ మొత్తాన్ని ఆయ‌న రిజెక్ట్ చేయ‌టం గ‌మ‌నార్హం. తాను తీసుకునే జీత‌మే ఎక్కువ‌ని.. ఇప్పుడు తాను చేస్తున్న ప‌ని కంటే ఎక్కువ జీతం వ‌స్తుంద‌న్న ఆయ‌న‌.. అద‌నంగా ఇక ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పిన ఆయ‌న తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News