భారత దిగ్గజాన్ని కలిసిన పాకిస్తాన్ కెప్టెన్.. బ్యాటింగ్ పాఠాలు విని గిఫ్ట్

Update: 2022-10-18 16:39 GMT
రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తమ టీ20 ప్రపంచ కప్ పోరును అక్టోబర్ 23, మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌తో ప్రారంభించనుంది. ఈ రెండు జట్లు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో గ్రూప్ 2లో ఉన్నాయి. ఈ హై-వోల్టేజ్ ఫైట్ జరగడానికి ముందు భారత మాజీ లెజెండ్ మరియు గత ప్రపంచ కప్ విజేత సునీల్ గవాస్కర్ ను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను కలుసుకున్నాడు. గవాస్కర్ ను ఆటకు సంబంధించి కొన్ని చిట్కాలను అడిగి తెలుసుకున్నాడు. పాక్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్ , న్యూజిలాండ్‌లను ముక్కోణపు సిరీస్‌లో ఓడించి, విజయవంతమైన జట్టుగా నిలిచింది. టీమిండియాను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డడానికి రెడీ అయ్యింది.  

గవాస్కర్ ను బాబర్ అజాం కలిసిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బాబర్ అజామ్‌తో భారత దిగ్గజం ఇంటరాక్ట్ అవుతున్నట్లు , ఆట మరియు అతని బ్యాటింగ్ గురించి కొన్ని కీలకమైన చిట్కాలను పంచుకున్నాడని వీడియో చూపిస్తుంది. ఆస్ట్రేలియాలో జరిగిన అనధికారిక పార్టీలో పాకిస్థాన్ కెప్టెన్ గవాస్కర్‌తో సంభాషించాడు.

భారతీయ లెజెండ్ కూడా బాబర్ కోసం ఒక టోపీపై సంతకం చేసి అతనికి బహుమతిగా ఇచ్చాడు. బాబర్‌కి గవాస్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ మాజీ దిగ్గజాలు సక్లైన్ ముస్తాక్ , మహ్మద్ యూసుఫ్ కూడా ఇక్కడ ఉన్నారు,  ఆటగాళ్లు పరస్పరం సంభాషించుకు్నారు.

న్యూజిలాండ్ -బంగ్లాదేశ్‌లపై ముక్కోణపు సిరీస్‌లో విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఉత్సాహంగా ఉంది. పాకిస్తాన్ విజయాలు ఆ జట్టుకు భారత్ తో పోరుకు ముందు మనోధైర్యాన్ని కల్పిస్తు్నాయి.  అంతకుముందు జరిగిన ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. యూఏఈ ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌లకు ఇదే ఓపెనింగ్ గేమ్.

పాకిస్థాన్ సెలక్టర్లు ఇటీవల ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు ఎదుర్కొన్నారు. వారి మిడిల్ ఆర్డర్ ఖచ్చితంగా గందరగోళంలో ఉంది.  బాబర్ లేదా రిజ్వాన్ పాకిస్తాన్ టీంకు ఓపెనర్లుగా వెన్నుముకగా ఉన్నారు. వీరిద్దరూ కనుక పరుగులు చేయడంలో  విఫలమైతే జట్టు కుప్పకూలుతోంది. టోర్నమెంట్‌లో ముందుకు  వెళ్లినప్పుడు వారు ఖచ్చితంగా ఈ మిడిల్ ఆర్డర్ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

పాకిస్తాన్ అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌తో తొలి మ్యాచ్ లో తలపడబోతోంది.  గత సంవత్సరం టీమిండియాపై ఒక మ్యాచ్ ఓడి మరో మ్యాచ్ ను పాకిస్తాన్ గెలిచింది. ఈసారి  పునరావృతం చేయాలని చూస్తోంది. భారత్ కూడా గట్టిగానే పోరాడుతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    

Similar News