దిగ్గజ క్రికెటర్.. పాకిస్తాన్ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ నేతల పాలనలో మగ్గిన పాకిస్తాన్ కు ఇప్పుడీ క్రికెటర్ కొత్త పాఠాలు నేర్పబోతున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇమ్రాన్ రాజకీయాల్లో చురుగ్గా మారారు. ఇటీవల పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సాధించి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తనతో కలిసి క్రికెట్ ఆడిన వారందరికీ ఆహ్వానాలు పంపారు.
ఇమ్రాన్ నాయకత్వంలో 1992లో పాకిస్తాన్ జట్టు వన్డే ప్రపంచకప్ ను గెలుచుకుంది. ఆ సమయంలో భారత్ తరఫున గవాస్కర్ - కపిల్ - నవజోత్ సింగ్ సిద్దూ లాంటి వారు ఆడారు. వీరిందరినీ తాను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరు కావాలని ఇమ్రాన్ ఖాన్ తాజాగా కోరారు.
అయితే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తాజాగా ఇమ్రాన్ ఖాన్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆగస్టు 18న ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేనని తెలిపాడట.. అదే రోజు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ఉండడంతో ఆ మ్యాచ్ కామెంటరీ చేయాల్సి ఉందని.. తాను ప్రమాణ స్వీకారంలో పాల్గొనలేకపోతున్నానని ఇమ్రాన్ కు గవాస్కర్ వివరించాడు.