జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నిందితులను విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఈ కేసులోకి తాజాగా రాష్ట్ర మహిళ కమిషన్ ఎంట్రీ ఇచ్చింది.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం సుమోటాగా స్వీకరించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని డీజీపీని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించింది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధితురాలికి మహిళా కమిషన్, ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ లో అత్యాచార ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం బాధిత బాలిక స్టేట్ మెంట్ ను మరోసారి రికార్డ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆరో నిందితుడిగా ఎమ్మెల్యే కుమారుడిని చేర్చనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడిపై పెట్టనున్న కేసుపై కూడా సందిగ్ధత నెలకొంది.
బెంజ్ కారులో క్లూస్ టీం ఆధ్వర్యంలో బాలిక చెవి కమ్మ, చెప్పులు, వెంట్రుకలు, నిందితుల వీర్యాన్ని(స్పెర్మ్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో స్వాధీనం చేసుకున్న టిష్యూ పేపర్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో మే 28న 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ముగ్గురు యువకులతో సహా మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా, బాలికను ఆమె ఇంటి వద్ద దింపుతానని హామీ ఇచ్చి వాహనంలో ఎక్కించుకుని నిందితులు లైంగికదాడికి పాల్పడ్డారు. నేరం చేసిన తర్వాత నిందితుడు ఆమెను పబ్ దగ్గర పడేశాడు.
బాలిక తండ్రి మే 31న తన కుమార్తె పగటిపూట పబ్ కు వెళ్లిందని, అక్కడ వేధింపులు జరిగి ఉండవచ్చని అనుమానిస్తూ పోలీసులను ఆశ్రయించారని డిసిపి తెలిపారు. బాలికను నెమ్మదిగా పోలీసులు ఆరాతీయగా గ్యాంగ్ రేప్ జరిగిందని తేలింది. దీని ప్రకారం పోలీసులు అరెస్ట్ లు చేశారు.