షాజ‌హాన్ తాజ్ ను వాళ్ల‌కు రాసిచ్చేశార‌ట‌!

Update: 2018-04-11 06:08 GMT
విచిత్ర‌మైన వాద‌న‌ను వినిపిస్తోంది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సున్నీ వ‌క్ప్ బోర్డు. ప్ర‌పంచంలో ఏడో వింత‌.. ప్ర‌ఖ్యాత క‌ట్ట‌డ‌మైన తాజ్ మ‌హాల్‌ను మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి షాజ‌హాన్ త‌మ‌కు రాసిచ్చారంటూ వాదిస్తోంది యూపీ సున్నీవ‌క్ఫ్ బోర్డ్‌.  దీనికి సంబంధించిన న్యాయ‌పోరాటం సుప్రీంలో సాగుతోంది.

ఇదిలా ఉండ‌గా.. తాజ్ మ‌హాల్ ను సున్నీ బోర్డుకు షాజ‌హాన్ రాసిచ్చిన ప‌త్రాల్ని చూపించాల‌ని కోర్టు కోరింది. ఇందుకోసం సున్నీబోర్డుకు వారం రోజుల పాటు టైమిచ్చింది. భార్య ముంతాజ్ పై త‌న ప్రేమ‌కు గుర్తుగా షాజ‌హాన్ తాజ్ మ‌హ‌ల్‌ను నిర్మించిన వైనం తెలిసిందే.

తాజ్ మ‌హాల్ సున్నీబోర్డుకు చెందుతుంద‌న్న షాజ‌హాన్ చేసిన డిక్ల‌రేష‌న్ కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉండి ఉంటే వాటిని కోర్టు ముందు ప్ర‌వేశ పెట్టాల‌ని సుప్రీం కోరింది. తాజ్ మ‌హాల్ సున్నీబోర్డుకు చెందుతుందంటే భార‌త‌దేశంలో ఎవ‌రు మాత్రం న‌మ్ముతారు?  ఇలాంటి వాద‌న‌ల వ‌ల్ల కోర్టు విలువైన స‌మ‌యం వృధా అవుతుంద‌ని వ్యాఖ్యానించింది. భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత తాజ్ తో పాటు దేశంలోని సాంస్కృతికత‌ను తెలియ‌జెప్పే క‌ట్ట‌డాల‌ను కాపాడే బాధ్య‌త‌ను ఆర్కియలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది. త‌న భార్య మ‌ర‌ణంతో ఆమె గుర్తుగా షాజ‌హాన్ తాజ్ మ‌హాల్‌ను నిర్మించారు. 1658లో మ‌ర‌ణించిన షాజ్ హాన్‌.. త‌న ప్రేమ‌గుర్తును ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు ఇస్తారా? అన్న సందేహాలు ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News