అయోధ్య అగ్గి: సున్నీకి హ‌క్కులేదంటున్న షియా

Update: 2017-12-01 07:09 GMT
అయోధ్య‌లోని వివాదాస్ప‌ద స్థ‌లంలో రామమందిర నిర్మాణ‌ వివాదం ఎంత కాలంగా ర‌గులుతుందో తెలిసిందే. రామాల‌య నిర్మాణానికి సంబంధించి తాజాగా ముస్లింల‌లోని షియా.. సున్నీల మ‌ధ్య కొత్త మంట‌లు పుట్టేలా చేస్తోంది. అయోధ్య‌లో రామాల‌య‌ నిర్మాణానికి సంబంధించి షియా వ‌క్ఫ్ బోర్డు సానుకూలంగా స్పందించిన నేప‌థ్యంలో సున్నీలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో సున్నీల తీరును షియాలు మండిప‌డుతున్నారు. ఇరువ‌ర్గాల వారు అయోధ్య‌లోని వివాదాస్ప‌ద స్థ‌లంపై త‌మ‌కే హ‌క్కు ఉంద‌ని వాదిస్తున్నారు. ఇలా ఇరు వ‌ర్గాల మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్ధం అంత‌కంత‌కూ ముదురుతోంది. ఇదిలా ఉండ‌గా తాజాగా షియా వ‌క్ఫ్ బోర్డు స్పందించింది.

వివాదాస్ప‌ద క‌ట్ట‌డం విష‌యంలో సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు ఎలాంటి హ‌క్కులు లేవ‌ని షియా వ‌క్ఫ్ బోర్డు ప్ర‌క‌టించింది. బాబ్రీ మ‌సీదు.. వివాదాస్ప‌ద స్థ‌లం గురించి త‌మ వ‌ద్ద త‌గిన డాక్యుమెంట్లు ఉన్నాయ‌ని షియా వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ రిజ్వీ ప్ర‌క‌టించారు. త‌మ వ‌ద్ద ఉన్న డాక్యుమెంట్ల‌ను ఇప్ప‌టికే సుప్రీం ముందు ఉంచిన‌ట్లుగా పేర్కొన్నారు. వివాదంలో ఉన్న మ‌దుర‌..కాశీ లోని మందిర‌.. మ‌సీదు అంశాల్ని చూసుకోవాలంటూ  సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు సూచించింది షియా వ‌క్ఫ్ బోర్డు.

వివాదాస్ప‌ద స్థ‌లంపై కోర్టు షియా వ‌క్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పును ఇస్తే.. అందులో హిందువుల మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆల‌యం నిర్మించుకోవ‌టానికి భూమిని ఇచ్చేస్తామ‌ని షియా వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ వాసిమ్ రిజ్వీ వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో ల‌క్నీలో మ‌రో మ‌సీదును నిర్మిస్తామ‌ని ఆయ‌న స్ప‌స్టం చేశారు. తాజాగా షియా వ‌క్ఫ్ బోర్డు వ్యాఖ్య‌ల‌కు సున్నీ వ‌క్ఫ్ బోర్డు రియాక్ష‌న్ ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News