డేవిడ్ వార్నర్ ను వదులుకుంది.. రషీద్ ఖాన్ ను నిలుపుకోలేదు.. ఎవరో ఇద్దరు కశ్మీర్ కుర్రాళ్లను అట్టిపెట్టుకుంది.. ప్రధాన పేసర్ ఫామ్ లోనే లేడు.. లైనప్ లో మొనగాడైన బ్యాట్స్ మన్ లేడు.. కెప్టెన్ ను ఫామ్ తో పాటు గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి.. అసలు ఈ సీజన్ కు తగిన జట్టేనా? అనే అనుమానాలు.
దీనికితోడు వరుసగా రెండు దారుణ పరాజయాలు. అదికూడా మొదట్లోనే. అంతే సన్ రైజర్స్ హైదరాబాద్ పై విమర్శలు మొదలయ్యాయి. అసలే పెద్దగా ఆకర్షణ లేని జట్టేమో దాడి మరింత పెరిగింది. కానీ, మూడో మ్యాచ్ నుంచి మెల్లగా కోలుకుంది. వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి ఇప్పుడు ఔరా అనిపిస్తోంది. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై ఆడిన తీరు చూస్తే.. సన్ రైజర్స్ ఈసారి కప్పు కొట్టినా ఆశ్చర్యం లేదనే వ్యాఖ్యలు వచ్చాయి.
కలిసొచ్చిన కుర్రాళ్లు..
సన్ రైజర్స్ బలమంతా మొదటినుంచి బౌలింగే. స్పిన్నర్ రషీద్ ఖాన్, పేసర్ భువనేశ్వర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బౌలర్లు అదరగొట్టేవారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడేవారు. అయితే ఈసారి హైదరాబాద్ బౌలింగ్ కుదురుకోవడానికి సమయం పట్టింది. భువీ ఫర్వాలేదనిపించినా.. నిరుడు గాయంతో దూరమైన పేసర్ నటరాజన్ వస్తూనే లయ దొరకబుచ్చుకోలేకపోయాడు. రిటైన్ చేసుకున్నవారిలో కశ్మీరీ పేసు గుర్రం ఉమ్రాన్ మాలిక్ దీ ఇదే పరిస్థితి.
అయితే, ఇప్పుడు వీరంతా దుమ్ము రేపుతున్నారు. ఉమ్రాన్ వేగానికి, నటరాజన్ యార్కర్లకు ప్రత్యర్థి బ్యాట్స్ మన్ వద్ద సమాధానమే ఉండడం లేదు. శనివారం మ్యాచ్ లో నటరాజన్ వేసిన బంతులకు వికెట్లు నాట్యమాడాయి. వీరికి మరో పేస్ ఆల్ రౌండర్ మార్కొస్ జన్ సేన్ (దక్షిణాఫ్రికా) జతకలవడంతో హైదరాబాద్ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఎటొచ్చీ స్పిన్ లోనే బలహీనంగా కనిపిస్తోంది. రషీద్ స్థాయి కాకున్నా మరో నాణ్యమైన స్పిన్నర్ ను హైదరాబాద్ వెదికి పట్టుకుంటే మున్ముందు కూడా తిరుగుండదు.
బ్యాటింగ్ లో అభిషేకం
హైదరాబాద్ బ్యాటింగ్ లో ప్రస్తుతం నయా సంచలనం అభిషేక్ శర్మ. 21 ఏళ్ల ఈ పంజాబ్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ భయం లేకుండా ఆడుతున్నాడు. గెలిచిన ఐదు మ్యాచ్ ల్లోనూ అభిషేక్ వరసగా 75, 42, 3, 31, 47 పరుగులు చేశాడు. అంటే.. హైదరాబాద్ విజయంలో అతడి బ్యాట్ ఎలాంటి పాత్ర పోషించిందో తెలుస్తోంది. ఇతడికి సీనియర్, కెప్టెన్ విలియమ్సన్ నుంచి చక్కటి అండ లభిస్తోంది.
వాస్తవానికి విలియమ్సన్ లో కనిపించని విధ్వంసకారుడున్నాడు. కానీ, ఆ బాధ్యతను అభిషేక్ కు అప్పగించి తాను యాంకర్ గా నిలుస్తున్నాడు కేన్. ఇక రాహుల్ త్రిపాఠి దేశవాళీలో నాణ్యమైన బ్యాట్స్ మన్. కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లోనూ రాణిస్తున్నాడు. మార్క్ రమ్ (దక్షిణాఫ్రికా), నికొలస్ పూరన్ (వెస్టిండీస్) బిగ్ హిట్టర్లు.
వీరికి లోయరార్డర్ లో మరొక మంచి బ్యాట్స్ మన్ తోడైతే ఈ సీజన్ కప్పు హైదరాబాద్ దే అనడం లో సందేహం లేదు. శశాంక్ సింగ్, జగదీశ్ సుచిత్ లతో లోయరార్డర్ పై నమ్మకం కనిపించడం లేదు. జన్ సేన్ ఆల్ రౌండర్ అయినా.. పూర్తి స్థాయిలో బ్యాటింగ్ ప్రతిభ బయటపడలేదు. ఈ ఒక్క లోపాన్నీ సన్ రైజర్స్ సరిచేసుకుంటే.. లీగ్ లో దుమ్మురేపడం ఖాయం.