రెఢీ కండి; ఈ నెల 27న ఖగోళ వింత

Update: 2015-09-16 04:51 GMT
మరో ఖగోళ వింత కనువిందు చేయనుంది. అరుదుగా చోటు చేసుకునే ఈ వింత మరో పదకొండు రోజుల్లో ఆవిష్కృతం కానుంది. భూమికి దగ్గరగా రానున్న చంద్రుడు.. అదే రోజు చంద్రగ్రహం చోటు చేసుకునే అరుదైన ఘటన త్వరలో ఏర్పడనుంది.

దాదాపు 30 సంవత్సరాల తర్వాత చోటు చేసుకుంటున్న ఈ ఖగోళ వింత ఉత్తర.. దక్షిణ అమెరికా.. యూరప్.. ఆఫ్రికా.. పశ్చిమ ఆసియా..తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో కనువిందు చేస్తుందని చెబుతున్నారు. భూమికి దగ్గరగా రానున్న చంద్రుడు.. అదే రోజు గ్రహణం ఏర్పడటంతో ఈ నెల 27న రాత్రి సుమారు 1.12 గంటల పాటు ఈ అద్భుతం దర్శనమిస్తుందని చెబుతున్నారు.

ఇక ఈ అరుదైన ఖగోళ వింత భారత కాలమానం ప్రకారం అయితే.. 28న ఉదయం 5.41 గంటలకు భూమి నీడ చంద్రుడి మీద పడటం మొదలవుతుందని చెబుతున్నారు. మొత్తంగా భూమికి దగ్గరగా వచ్చే చంద్రుడ్ని ఈ నెల 27 చూడొచ్చని చెబుతున్నారు.
Tags:    

Similar News