కేంద్ర బ‌డ్జెట్‌: ఉద్యోగుల‌కు సూప‌ర్ న్యూస్‌

Update: 2019-07-05 08:54 GMT
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్ర‌వారం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ లో ఉద్యోగులపై వరాలు కురిపించారు. కొన్ని అంశాల్లో షాకులు ఇచ్చినా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు కొన్ని విష‌యాల్లో వెసులుబాటు క‌ల్పించారు. సామాన్య‌, మధ్యతరగతి జీవులపై పన్నుల భారాన్ని తగ్గించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచడం కోట్లాది మంది ఉద్యోగులకు ఊరట కల్గిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప్రస్తుతం యేడాదికి రూ.5 ల‌క్ష‌ల వార్షికాదాయం ఉన్న‌వారు ఆదాయ‌పు ప‌న్ను నుంచి మిన‌హాయింపు ప‌రిధిలోకి వ‌స్తారు. ఇక గత ఐదేళ్లలో ప్రత్యక్షపన్నుల ద్వారా 7 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చింద‌ని కూడా నిర్మ‌ల తెలిపారు. అయితే ఎన్నిక‌ల‌కు ముందు ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ లో కూడా కేంద్రం రూ. 5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే పన్ను మినహాయింపుకు సంబంధించి మ‌రో ప్ర‌తిపాద‌న కూడా మంత్రి చెప్పారు. రూ. 400 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు 25 శాతం పన్ను మినహాయింపు  ఇవ్వనున్నట్టు  మంత్రి చెప్పారు. అలాగే వ్యాపార లావాదేవీల్లో న‌గ‌దు చెల్లింపులు అరిక‌ట్ట‌డ‌మే ధ్యేయంగా డిజిట‌ల్ లావాదేవీల‌పై ప‌న్నులు లేవ‌ని చెప్పిన ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి ఏడాదిలో రూ. కోటి  విత్‌ డ్రా  చేస్తే 2శాతం పన్ను వసూలు చేస్తామని చెప్పారు.
 
Tags:    

Similar News