బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..బగ్స్ కనిపెడితే 3 లక్షలు మీవే!

Update: 2020-05-27 11:10 GMT
దేశంలో వైరస్ విజృంభణ మొదలైన కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఆరోగ్యసేతు యాప్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ఇప్పటికే వరల్డ్ రికార్డ్ సాధించింది. అతి తక్కువ సమయంలో అత్యధిక డౌన్ లోడ్ చేసుకున్న యాప్ గా రికార్డ్ కెక్కింది. అయితే, ఈ యాప్ ను సోర్స్ కోడ్ ను పబ్లిక్ కోడ్ గా మారుస్తున్నారు. దీనితో ఆరోగ్యసేతు యాప్‌లో బగ్స్ కనిపెడితే రూ.3లక్షల బంపర్ గెలుచుకోండి అంటూ ప్రకటించారు ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ నీతావర్మ‌.

ఈ యాప్‌ లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్ ‌‌ను గుర్తించినవారికి ఈ బహుమతిని అందిస్తామని తెలిపారు. దీంతోపాటు మరో సూపర్ ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. కోడ్‌ మెరుగుదలకు మంచి సూచనలు చేసిన వారికి ఈ సూపర్ ప్రైజ్ మనీ రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఒక యాప్‌కు సంబంధించి బహుమతి ప్రకటించడం ఇదే తొలిసారన్నారు నీతా వర్మ. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈపాస్‌ జారీ చేస్తే అది ఆరోగ్యసేతు యాప్‌తో అనుసంధానం అవుతుందని… ప్రత్యేకంగా పాస్‌ కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్స్‌ అంతా ఈ యాప్‌ ఉపయోగించాలని ఆదేశించారు.
Tags:    

Similar News