రజనీకాంత్‌ టార్గెట్‌ సీఎం చైరే

Update: 2019-02-17 09:03 GMT
రజనీకాంత్‌ సీరియస్‌ హీరో. అందరికి తెలిసిందే కానీ సీరియల్ పొలిటీషియనా అంటే సమాధానం మాత్రం కాదనే వస్తుంది. రాజకీయాల్లోకి వస్తాను అన్నారు. పార్టీ పెడతాను అన్నారు. మళ్లీ అవన్నీ పక్కన పెట్టేసి.. ప్రశాంతంగా కబాలి, కాలా అంటూ సినిమాలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆయనలో ఉన్న రాజకీయ నాయకుడు నిద్రలేస్తాడు. నిద్రలేచిన ప్రతీసారి.. ఏదో ఒక స్టేట్‌ మెంట్‌ ఇచ్చి సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు అలాంటి స్టేట్‌ మెంటే రజనీ నుంచి వచ్చింది. తనకు చెందిన పార్టీ వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తమ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికల పైనే ప్రకటించారు.

మొదటినుంచి రజనీకాంత్‌ కు జాతీయ రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. ఆయన కన్నంతా సీఎం కుర్చీపైనే ఉంది. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ లా రాజకీయాల్లోకి రాగానే సీఎం అవ్వాలనేది రజనీ కోరిక. అందుకే పార్టీని అప్పుడే ఏర్పాటు చేయకుండా దూరంగా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేసి లోక్‌ సభ ఎన్నికలకు వెళ్లొచ్చు. కానీ రిజల్ట్‌ తేడా వస్తే పరువు పోతుంది. ఈ రిజల్ట్ ఎఫెక్ట్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. అందుకే.. తెలివిగా లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి.. తన దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే అని చెప్పకనే చెప్పారు సూపర్‌స్టార్ రజనీకాంత్‌.


Tags:    

Similar News