అప్పుడప్పుడు ఖగోళ వింతలు చోటు చేసుకుంటుంటాయి. అరుదుగా ఆవిష్కృతమయ్యే ఇలాంటి వింతల్ని ఒక్కసారి మిస్ అయితే.. జీవితకాలంలో మరోసారి వాటిని చూసే ఛాన్స్ ఉండదు. కొన్ని విశేషాలకు మాత్రం అవకాశం లభిస్తుంది. తాజాగా చెప్పబోయేది అలాంటి ఖగోళ వింతే. ప్రతి పౌర్ణమి రోజున రోజూ కనిపించే చంద్రుడితో పోలిస్తే.. మరింత ప్రకాశవంతంగా కనిపించటం తెలిసిందే. పౌర్ణమి రోజు పిండి ఆరబోసినట్లుగా ఉండే వెన్నెల వెలుగుల అనుభూతి ఇప్పటి నగర జీవికి తెలీకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇప్పటికీ అది అనుభవమే.
పౌర్ణమి నాటి చంద్రుడి అందాలకే మురిసిపోతే.. రేపు (సోమవారం) ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కంటే మరింత పెద్దగా.. ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. సూపర్ మూన్ గా అభివర్ణించే ఈ ఖగోళ అద్భుతం గతంలో 1948లో ఒకసారి కనువిందు చేసింది. మళ్లీ 70 ఏళ్ల తర్వాత సోమవారం మరోసారి అలా కనిపించనున్నాడు.
చంద్రుడి కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉండటం.. భూమికి దగ్గరగా చంద్రుడు రావటంతో ఇలాంటి వింత చోటు చేసుకోనుంది. సోమవారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి సైజు దాదాపు 14 వాతం పెద్దదిగా.. ఎప్పుడు కనిపించే దానితో పోలిస్తే 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఖగోళ అద్భుతంగా చెప్పే ఈ విశేషాన్ని రేపు కానీ మిస్ అయితే.. మళ్లీ 2034 వరకూ ఇలాంటి దాని కోసం వెయిట్ చేయాల్సిందే. అందుకే.. ఎన్ని పనులు ఉన్నా.. రేపటి సాయంత్రానికి కాసేపు పనుల్ని.. ఒత్తిళ్లను.. హడావుడిని కాసేపు పక్కన పెట్టి.. నీలాకాశం (కాలుష్యం నేపథ్యంలో ఆ మాట అనకూడదేమో?)లోకి చూసి.. పే..ద్దగా.. బ్రైట్ గా కనిపించే పున్నమి చంద్రుడ్ని చూడండి. ఏ మాత్రం మిస్ కాకండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/