సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల విషయంలో చాలా వరకు న్యూట్రల్ గా ఉండాలని భావిస్తారు. తమ సినిమాలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనే ఉద్దేశ్యంతో వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతుగా మాట్లాడటం.. లేదంటే వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా ఉండటం చేస్తారు. అతి కొద్ది మంది మాత్రమే అధికార పార్టీకి ఎదురు తిరిగినట్లుగా మాట్లాడుతారు.
ఇటీవల హిందీ భాష జాతీయ భాష అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ కంటే ప్రథానంగా హిందీ భాషను నేర్చుకోవాలంటూ కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. హిందీ ప్రాముఖ్యతను వివరించే క్రమంలో ఆయన సౌత్ భాషలపై ఇండైరెక్ట్ గా విమర్శలు చేశాడు అంటూ దుమారం లేచింది. ఆ విషయంలో పలువురు పలు రకాలుగా స్పందించారు. ప్రజా సంఘాల వారు అమిత్ షా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీ నుండి ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ విషయంలో స్పందించలేదు. ఎట్టకేలకు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించాడు. సౌత్ సినీ పరిశ్రమ ఈమద్య కాలంలో బాలీవుడ్ సినిమాలను కూడా బీట్ చేసి ఇండియన్ సినిమాలు గా నిలుస్తున్నాయి. భాష తో సంబంధం లేకుండా సౌత్ సినిమాలు ఈ స్థాయిలో రాణిస్తూ ఉంటే ఇప్పుడు హిందీ ప్రాముఖ్యతను చెప్తూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ సుదీప్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కేజీఎఫ్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. కనుక సౌత్ సినిమాలు బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్నాయి కనుక హిందీ భాష గొప్ప అంటూ అమిత్ షా వ్యాఖ్యలు చేయడం సరి కాదు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా సుదీప్ కౌంటర్ ఇచ్చాడు.
సుదీప్ వ్యాఖ్యలను టార్గెట్ చేసిన బీజేపీ నాయకులు అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుడు అర్థం వచ్చేలా ప్రజల వద్దకు తీసుకు వెళ్లేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అమిత్ షా వ్యాఖ్యలను సుదీప్ తో కలిసి ఖండిస్తున్నారు. ఈ సమయంలో అమిత్ షా మరియు సుదీప్ ల వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.