సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ మేరకు వైద్యులు మీడియాకు వివరాలు తెలిపారు.
కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ‘రాత్రి సుమారు 2 గంటల సమయంలో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. గుండెపోటు రావడంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశాం. 20 నిమిషాల సీపీఆర్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటకొచ్చారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
రేపటి వరకూ పరిస్థితి చూసి రేపు మధ్యాహ్నం మరోసారి మీడియాకు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాం. మరో 48 గంటల వరకూ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేం అని వైద్యులు తెలిపారు.
కృష్ణ కుటుంబంలో ఈ ఏడాదిలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు ముందుగా మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య , మహేశ్ తల్లి ఇందిరా దేవి మరణించారు. అంతకుముందు కృష్ణ రెండో భార్య విజయ నిర్మల సైతం కన్నుమూశారు. ఈ విషాదాలన్నీ కళ్ల ముందర కదలాడుతున్న వేళ కృష్ణ కృంగుబాటుకు గురైనట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి మానసిక వేధనతో ఉన్న కృష్ణకు నిన్న రాత్రి సడెన్ గా గుండెపోటు రావడం.. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడం జరిగిపోయింది.