ఎన్టీయార్ ని గెలిపించి....ఓడించిన క్రిష్ణ

Update: 2022-11-15 07:30 GMT
సూపర్ స్టార్ క్రిష్ణ రాజకీయ రంగ ప్రవేశం చిత్రంగా జరిగింది. ఆయన సినిమాల్లో బిజీగా ఉంటున్న టైం అయింది. నాలుగు పదుల వయసు. చేతి నిండా ఎన్నో సినిమాలు.ఎన్టీయార్ అప్పటికే తెలుగుదేశం పార్టీని పెట్టి సీఎం అయ్యారు. దాంతో ఆయన నిర్మాతలు కూడా క్రిష్ణ వద్దకే క్యూ కట్టారు. సూపర్ స్టార్ గా క్రిష్ణ వెలుగొందుతున్న టైం అది.

అలాంటి టైం లో 1984లో ఇందిరా గాంధీ దారుణ హత్య జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సింపతైజర్ గా ఉన్న క్రిష్ణ పార్ధిక దేహాన్ని చూసేందుకు ఢిల్లీ వెళ్ళిన టైం లో రాజీవ్ గాంధీ ఆయన నుంచి ఒక మాట తీసుకున్నారు. దాని ప్రకారం ఆయన కాంగ్రెస్ లో చేరి ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతుగా కృషి చేశారు. ఒక విధంగా ఆయన అలుపెరగని పోరాటమే చేశారు.

నాడు ఎంతో బలంగా ఉన్న ఎన్టీయార్ ని ఢీ కొట్టడం అంటే సామాన్య విషయం కాదు, ఎన్టీయార్  ని విమర్శిస్తే టీడీపీ వారు ఊరుకునేవారు కాదు. అలా ఒక సభలో ఎన్టీయార్ గురించి విమర్శలు క్రిష్ణ చేస్తే ఆయన మీద రాయి విసిరి కంటికి గాయం చేశారు కూడా. అయినా మొక్కవోని ధైర్యంతో క్రిష్ణ నాడు టీడీపీ హయాంలో జరిగిన అవతతవకలను సినిమాల రూపంలో బయటపెట్టారు.

మండలాధీశుడు అన్న సినిమా అయితే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా టీడీపీ పాలనలో ఏమి జరుగుతోంది అన్నది కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అలాగే నా పిలుపే ప్రభంజనం మూవీ కూడా టీడీపీ పాలన మీద తీసిన మరో సినిమా. గండికోట రహస్యం అంటూ మరో మూవీ పొలిటికల్ సెటైరికల్ గా నిలిచింది. ఇక 1989 ఎన్నికల్లో ఎన్టీయార్  పాలన మీద క్రిష్ణ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లోనే ఆయన ఏలూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేసి ఏకంగా 71 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే 1991లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు.

మరో వైపు 1989లో ఉమ్మడి  ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రిష్ణ తన సినీ కెరీర్ ని సైతం ఫణంగా పెట్టి అనేక సినిమాలు తీయడమే కాదు, బయట టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలా మేరు నగధీరుడు అయిన ఎన్టీయార్ ని ఆయన రాజకీయంగా ఢీ కొట్టి కాంగ్రెస్ తనకు ఇచ్చిన టార్గెట్ ని పూర్తి చేశారు.

దీనికంటే ముందు మరో తమషా రాజకీయ ఘటన ఉంది.ల్ 1983లో టీడీపీ అధికారంలోకి రావడానికి కృష్ణ  తీసిన ఈనాడు చిత్రం కారణం అయింది. అది పూర్తిగా రాజకీయ చిత్రం. అది ఒక రీమేక్ మూవీ అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలచి తీశారు. దాంతో ఆనాడు ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద పాలన మీద విమర్శలు కూడా అందులో కనిపించాయి. దాంతో జనాలు పూర్తిగా విసిగి టీడీపీకి పట్టం కట్టారు.

అలా కృష్ణ ఎన్టీయార్ ని ఒకసారి గెలిపించారు. మరోసారి ఓడించారు. అలా తన రాజకీయాన్ని కూడా ఆయన తానుగానే పక్కను తప్పుకుని ముగించారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ అభిమానింగానే చివరిదాకా కొనసాగడం విశేషం.
Tags:    

Similar News