సాధారణ ప్రజలూ.. మీరూ ఒకటే..: ప్రజాప్రతినిధులకు సుప్రీం స్పష్టీకరణ
''నేను మంత్రిని.. ఏం చేసినా చెల్లుతుంది!'' ''నేను ఎమ్మెల్యే చెప్పింది వినండి'' ''నేను ఎంపీని నన్నే ప్రశ్నిస్తారా?'' - అని దేశంలో చాలా మంది ప్రజాప్రతినిధులు గీర్వాణం ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు.. తమ ముందు..నిర్మొహమాటంగా మాట్లాడే సాధారణ ప్రజలపైకేసులు కూడా పెట్టించిన మహానుభావులు ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఇకమీదట అలా కుదరదు.
దేశంలో ప్రజలు.. ప్రజా ప్రతినిధులు ఒక్కటే! ప్రజా ప్రతినిధులకు ఎలాంటి కొమ్ములు లేవు.. వారు కూడా సాధారణ పౌరుల లెక్కే!! అని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
తాజాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(ఫ్రీడం ఆఫ్ స్పీచ్), భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉండే భావ ప్రకటన స్వేచ్ఛ సామాన్యులకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ ఒక్కటే! అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఆంక్షలేమీ(ఎలాగైనా మాట్లాడొచ్చు అనే) విధించలేమని స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19-1-A ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించాల్సిన అవసరం లేదని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరైనా మంత్రి ప్రభుత్వ పనితీరుపై ఏవైనా వ్యాఖ్యలు చేస్తే.. వాటిని ఆ ప్రభుత్వానికి ఆపాదించాల్సిన అవసరం లేదంటూ తీర్పు వెలువరించింది.
ఈ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ BV నాగరత్న మాత్రం ప్రత్యేక తీర్పు ఇచ్చారు. ప్రభుత్వాలు, పాలన తీరుపై వ్యాఖ్యలు చేసే హక్కు ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే అది... విద్వేష ప్రసంగంగా మారకూడదని ఆమె స్పష్టం చేశారు.
అత్యాచార బాధితులపై గతంలో ఉత్తర్‌ప్రదేశ్ మంత్రిగా పనిచేసిన ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చింది. అయితే ప్రజాప్రతినిధులకు స్వీయ నియంత్రణ అవసరమని.. జస్టిస్ నాగరత్న తీర్పులో ప్రస్తావించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.