సెక్స్ వర్కర్ల విషయంలో పోలీసులు.. మీడియా ఏమేం చేయొద్దని సుప్రీం చెప్పిందంటే?
మేం సెక్సు వర్కర్లను సమర్థించం. అలా అని వారి విషయంలో మాకున్న సానుభూతిని ప్రదర్శించేందుకు అస్సలు వెనుకాడం. నిజం చెప్పాలంటే.. ప్రపంచంలో ఏ పని అయినా చేయొచ్చేమో కానీ.. సెక్సు వర్కర్ల పని చేయటం చాలా కష్టం. కారణం.. ఏదైనా సెక్సు వర్కర్లు ఆ పని చేస్తున్నారంటే.. దాని వెనుక ఏదో బలమైన కారణాలు ఉంటాయి.
ఒక్కొక్కరిది ఒక్కో కథ. అలాంటివారి విషయంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఉన్న సమస్యను ఉన్నట్లుగా చర్చించింది లేదు.. వారి సమస్యల మీద ఫోకస్ చేసింది లేదు. సమాజంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండటమే కాదు.. నిత్యం శారీరక హింసకు గురయ్యే వారి విషయంలో మిగిలిన వారికి ఏ మాత్రం తీసిపోని రీతిలో కొన్ని రంగాలకు చెందిన వారు వేధింపులకు గురి చేస్తుంటారు.
అయితే.. తమ పని తాము చేస్తున్నామే తప్పించి.. సెక్సు వర్కర్ల విషయంలో తాము వేధింపులకు గురి చేయటం లేదని పోలీసులు.. మీడియాకు చెందిన వారు వాదిస్తారు. కానీ.. ఈ రెండు రంగాలకు చెందిన కొందరు వ్యవహరించే తీరు మహా దారుణంగా ఉంటుంది. ప్రపంచంలో మరే నేరాలు.. ఘోరాలు జరగనట్లుగా వ్యభిచారం చేస్తున్నారంటూ సెక్సు వర్కర్లను విపరీతంగా వేధింపులకు గురి చేయటం..వారినిఅరెస్టు చేయటం.. వారి నుంచి డబ్బులు దండుకోవటం లాంటివి కొందరు పోలీసులు చేస్తుంటారు. వీరికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మీడియాకు చెందిన కొందరు చెలరేగిపోతుంటారు. వారి ఫోటోల్ని ప్రచురించే విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.
సెక్సు వర్కర్లను ఏ విధంగానూ వేధించొద్దని.. అన్ని రాష్ట్ర.. కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా తనిఖీలు నిర్వహించిన వేళలో పట్టుబడిన సెక్స్ వర్కర్ల ఫోటోలను మీడియా ప్రచురించకూడదని.. అందరికి ఇచ్చినట్లే వారికీ కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొంది. వారిపై భౌతికంగా కానీ మాటలతో కానీ ఎలాంటి దాడి చేయకూడదని పోలీసులు ఆదేశించింది. వారి విషయంలో మర్యాద పాటించాలని పేర్కొంది.
ఒకవేళ మీడియా వారి ఫోటోల్ని ప్రచురించినా.. వారి గుర్తింపును వెల్లడించినా.. ప్రచురణకర్తలపై ఐపీసీ 354సీ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. సెక్సు వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కీలక సిఫార్సులు చేయగా.. వాటిని అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.
సుప్రీం ఆమోదించిన సిఫార్సులు ఏమంటే..
- వ్యభిచార గృహాన్ని నిర్వహించటం చట్ట విరుద్ధం. అదే సమయంలో స్వచ్ఛందంగా వ్యభిచారం చేయటం నేరం కాదు.
- అందువల్ల గృహాలపై దాడులు నిర్వహించినప్పుడు స్వచ్ఛందంగా ఉంటున్న సెక్సు వర్కర్లను అరెస్టు చేయకూడదు. వారిని శిక్షించటం.. వేధించటం కానీ చేయకూడదు.
- ఎవరినైనా బలవంతంగా నిర్బంధించినట్లుగా తేలితే వారి పరిస్థితులను సమీక్షించి నిర్దిష్ట గడువు లోపు వారిని విడిపించటానికి చర్యలు తీసుకోవాలి.
- ఏ సెక్సు వర్కర్ అయినా లైంగికదాడికి గురైతే ఇతరుల మాదిరి వారికీ సౌకర్యాలు కల్పించాలి. సీఆర్ పీసీ సెక్షన్ 375సీ ప్రకారం తక్షణ వైద్య సేవలు అందించాలి.
- సెక్సు వర్కర్ల పట్ల పోలీసులు వైఖరి క్రూరంగా.. హింసాత్మకంగా ఉంటోంది. అందుకే వారి విషయంలో సున్నితంగా వ్యవహరించాలి.
- సెక్సు వర్కర్లకు మిగిలిన పౌరుల మాదిరే రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులు ఉన్నట్లు గుర్తించాలి.
- సెక్సు వర్కర్ల ఫోటోలు.. వారి వివరాలు వెల్లడించకుండా మీడియా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు.. నిందితుల ఫోటోల్ని ప్రసారం చేయటం..ఫోటోల్ని ప్రచురించటం చేయకూడదు.
- ఐపీసీ 354సీ సెక్షన్ కింద ఇతరుల లైంగిక కార్యకలాపాలను చూడటం నేరం. అందువల్ల ఈ సెక్షన్ ను ఎలక్ట్రానిక్ మీడియా మీద కఠినంగా అమలు చేయాలి. సెక్సు వర్కర్లు.. వారికి సంబంధించిన ఫోటోలు.. వివరాల్ని ప్రసారం చేయటం నిషిద్ధం.
- సెక్సు వర్కర్లు తమ ఆరోగ్యం.. భద్రత కారణంగా కండోమ్ లాంటివి దగ్గర ఉంచుకున్నప్పుడు వాటి ఆధారంగా చేసుకొని నేరంగా పరిగణించటానికి వీల్లేదు.
- సెక్సు వర్కర్లు అందరికి ఆధార్ కార్డులు జారీ చేయాలి.ఎక్కడా సెక్సు వర్కర్లు అని పేర్కొనకూడదు.