డైమండ్లకే డైమండ్ అయిన కోహినూర్ కోసం భారతీయుల ఆరాటం అంతాఇంతా కాదు. స్వాతంత్ర్యానికి ముందు భారత్ నుంచి ఎత్తుకెళ్లిపోయిన ఈ వజ్రాన్ని బ్రిటీషోడు తిరిగి ఇస్తాడో.. ఇవ్వడో తర్వాతి సంగతి. ముందైతే ప్రయత్నం జరగాలి. కానీ.. అలాంటిదేమీ ఇప్పటివరకూ జరగలేదు. ఆరు నూరు అయినా.. నూరు పదహారు అయినా కోహినూర్ తిరిగి ఇవ్వరన్నట్లుగా భారత సర్కారు వ్యవహరించే తీరుపై ప్రతి భారతీయుడు తీవ్ర ఆగ్రహం చేయటం కనిపిస్తుంది.
అందుకే.. దశాబ్దాల నాడు వెళ్లిపోయిన కోహినూర్ వజ్రం మీద మమకారం చంపుకోలేక ఇప్పటికీ ఆ అపురూప వజ్రాన్ని తిరిగి తెచ్చే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించటం కనిపిస్తుంది. ఆ మధ్యన ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ సుప్రీంలో ఒక వ్యాజ్యం వేసింది. కోహినూర్ ను తిరిగి తెప్పించేలా భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం సమాధానం ఇస్తూ.. కోహినూరు వజ్రాన్ని బ్రిటీష్ పాలకులు దొంగలించలేదని.. బలవంతంగా ఎత్తుకెళ్లటం లాంటది చేయలేదని.. పంజాబ్ రాజు ఈస్టిండియాకంపెనీకి బహుమతిగా ఇచ్చారంటూ వెల్లడించింది. అనంతరం ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యం వాయిదా పడింది.
ఇదిలా ఉంటే తాజాగా హెరిటేజ్ బంగ్లా అనే సంస్థ కోహినూర్ గురించి పిల్ వేశారు. అపురూపమైన ఈ వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా.. ఇప్పటివరకూ బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తెచ్చేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొంది. ఈ అంశం మీద పార్లమెంటులో ఎప్పుడైనా చర్చ వచ్చినా ప్రస్తావన తీసుకొచ్చి సరిపెడుతున్నారేకానీ.. కోహినూర్ ను వెనక్కి తెచ్చేలా ప్రయత్నం జరగలేదని పేర్కొన్నారు.
భారత సంస్కృతిలో భాగమైన ఈ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చేలా చూడాలంటూ పోరాటం చేస్తున్న వ్యాజ్యాలతో కలిపి విచారించాలంటూ కోరిన పిటీషన్ ను సుప్రీం అంగీకరించింది. కోహినూర్ వజ్రం మీద దేశ ప్రజల మనోభావాల్ని గుర్తించి సరైన ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీదన ఉందన్న విషయాన్ని మోడీ సర్కారైనా గుర్తిస్తుందా..?