డీజిల్ కార్లున్న‌వారికో గుడ్ న్యూస్‌

Update: 2016-08-12 15:39 GMT
డీజిల్ కార్లు వాడే వారికి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం శుభ‌వార్త తెలిపింది. నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌ లో 2000 సీసీకి పైన ఉన్న డీజిల్ కార్ల‌పై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తేసింది. అయితే కార్ల ఓన‌ర్లు ఒక శాతం అద‌న‌పు ప‌న్ను చెల్లించాల‌ని ఆదేశించింది. న‌గ‌రంలోని వాతావ‌ర‌ణాన్ని క‌లుషితం చేస్తున్నందుకు ఈ ప‌ర్యావ‌ర‌ణ సెస్సు క‌ట్టాల‌ని కోర్టు చెప్పింది. ఢిల్లీలో డీజిల్ కార్ల‌పై గ‌తేడాది సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. అయితే ఈ కార్ల త‌యారీదారులు నిషేధం ఎత్తేయాల‌ని కోరుతూ అప్పీల్ చేసుకున్నారు. క‌నీసం ప‌దేళ్లు పైబ‌డిన డీజిల్ వాహ‌నాల‌నైనా ఢిల్లీలో నిషేధించాల‌ని గ‌త నెల‌లో మ‌రో ప‌ర్యావ‌ర‌ణ కోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

గత ఏడాది విధించిన ఈ నిషేధంతో కార్ల ప‌రిశ్ర‌మ పెద్ద ఎత్తున కుదుపున‌కు లోన‌యింది. వినియోగ‌దారులతో పాటు కార్ల‌ సంస్థ‌లు ఈ నిర్ణ‌యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. అయితే ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాయి. ఈ క్ర‌మంలో కార్ల త‌యారీదారులు స‌మావేశం అయి త‌మ కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకున్నాయి. అనంత‌రం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌గా తాజా తీర్పు వెలువ‌డింది.
Tags:    

Similar News