గృహ హింస‌కు ఎవ‌రు పాల్ప‌డినా.. మొద‌టి ముద్దాయి అత‌డేః సుప్రీం కోర్టు

Update: 2021-03-10 00:30 GMT
బ‌హిరంగంగా జ‌రిగే అన్యాయాల‌కు సాక్షులు ఉండొచ్చు.. దాడుల‌ను చూసిన వారు ఉండొచ్చు.. కానీ, ఇంట్లో జ‌రిగే దారుణాల‌కు దాదాపుగా సాక్షులు ఎవ‌రూ ఉండ‌రు. అందుకే.. గృహ‌హింస చ‌ట్టాన్ని ప‌క‌డ్బందీగా రూపొందించారు. అయితే.. ఇలాంటి ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అత్తింట్లో ఎలాంటి వేధింపులు జ‌రిగినా.. ఆమె భ‌ర్తే ప్ర‌ధాన బాధ్యుడు అవ‌తాడ‌ని స్ప‌ష్టం చేసింది.

పంజాబ్ కు చెందిన కుషాగ్ర మ‌హాజ‌న్ అనే వ్య‌క్తి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆయ‌న భార్య‌కు అది రెండో వివాహం. 2017లో వీరి పెళ్లి జ‌ర‌గ్గా.. 2018లో ఆమె ఓ బిడ్డ‌కు జ‌న్మ‌న‌చ్చింది. అయితే.. ఆమెను అత్తింటివారు అద‌న‌పు క‌ట్నం కోసం త‌ర‌చూ వేధిస్తున్నార‌ని, భ‌ర్త‌, అత్తామామ ముగ్గురూ క‌లిసి గర్భం తీయించుకోవాల‌ని దాడిచేశార‌ని, క్రికెట్ బ్యాట్ తో కూడా కొట్టార‌ని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.

ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం.. భ‌ర్త కుటుంబంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. అయితే.. భ‌ర్త త‌ర‌పు లాయ‌రు స్పందిస్తూ.. భ‌ర్త దాడిచేయ‌లేద‌ని, ఆయ‌న తండ్రి కొట్టాడ‌ని చెప్పారు. మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన కోర్టు.. అత్తింట్లో ఎవ‌రు కొట్టార‌న్న‌ది ముఖ్యం కాదని, ఎవ‌రు వేధించినా.. భ‌ర్తే ప్ర‌ధాన ముద్దాయి అవుతాడ‌ని స్ప‌ష్టం చేసింది.
Tags:    

Similar News