రాయలసీమలో చంద్రబాబుకు డ్యామేజి జరిగింది... పట్టిసీమతో అక్కడ కొంత విశ్వాసం సంపాదించుకున్నా అదేసమయంలో వేసిన ఓ తప్పటడుగు తీవ్ర వ్యతిరేకత తెచ్చింది... విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన ఆ నిర్ణయం చంద్రబాబు స్వయంగా తీసుకున్నది కాకున్నా జరిగే నష్టం మాత్రం చంద్రబాబుకు, టీడీపీకే అన్నది కాదనలేని సత్యం... తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజిలో 150 మెడికల్ సీట్లను ఏపీలోని 13 జిల్లాలకు లోకల్ చేస్తూ జారీచేసిన జీవో నంబరు 120పై అక్కడ కొద్దిరోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే.. దీనిపై విద్యార్థులు కోర్టుకెళ్లగా తాజాగా ఆ జీవో చెల్లదని సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా గతంలో ఉన్నట్లు జోన్ల విధానంలోనే సీట్లు భర్తీ చేయాలని చెప్పింది. దీంతో అక్కడి విద్యార్థులకు ఎప్పటిలాగే న్యాయం జరిగినా టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం మాత్రం రాయలసీమ విద్యార్థుల మనసుల్లో నాటుకుపోయింది... అయితే.. ఈ నిర్ణయం చంద్రబాబు సొంత ఆలోచన కాదని.. కోస్తాంధ్రకు చెందిన ఇద్దరు నేతల ఒత్తిడితో ఆ నిర్ణయం జరిగిందని తెలుస్తోంది.
జీవో 120కి వ్యతిరేకంగా ఈమధ్య రాయలసీమ మండిపడింది. హైస్కూలు పిల్లల నుంచి యూనివర్సిటీల స్టూడెంట్లు వరకు అందరూ ధర్నాలు చేశారు. ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేశాయి. రాయలసీమ విద్యార్థులకు దక్కాల్సిన సీట్లను కోస్తా వారికి ఇచ్చే కుట్రని మండిపడ్డాయి. వాస్తవానికి ఆ జీవోతో రాయలసీమ విద్యార్థులకు నిజంగానే నష్టం జరుగుతుంది. మొత్తానికి కోర్టుకెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. కానీ, చంద్రబాబు ఇమేజికి మాత్రం డ్యామేజి జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయినా రాయలసీమ టీడీపీ నేతలు కూడా దీనిని లోలోన వ్యతిరేకించారు. ఇంత ఇబ్బంది తెచ్చిన ఆ జీవో సీఎం కార్యాలయం వేదికగానే రూపొందినప్పటికీ దాని వెనుక ఇద్దరు కోస్తా నేతలున్నట్లు సమాచారం. వారు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో చంద్రబాబు సరేననడం ఈ పరిస్థితి తెచ్చిందని రాయలసీమకు చెందిన పలువురు నేతలు చెబుతున్నారు.
ఇలాంటి అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు ఇకపై నేతల ఒత్తిళ్ల విషయంలో ఆచితూచి అడుగేయడం బెటర్. సీనియర్ నేతలనో... పార్టీలో ఆది నుంచి ఉన్నారనో వారు చెప్పిన ప్రతిమాటకు విలువిస్తే ఇలాంటి నష్టం తప్పదు.