న్యాయమూర్తుల నియామకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కీలక పరిమాణం చోటు చేసుకుంది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో.. హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంల్లో ప్రభుత్వం తరఫున ప్రతినిధులను చేర్చుకోవాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కి లేఖ రాశారు.
దీనివల్ల న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల విషయంలో కొలీజియం తీసుకునే నిర్ణయాలు, సిఫారసులను సమీక్షించడానికి తమకు అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని రిజిజు లేఖలో కోరారు. జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లు సుప్రీంకోర్టు వ్యవహరిస్తోందని ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య అభిప్రాయభేదాలు మొదలయ్యాయి.
న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమన్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు సైతం కాకరేపాయి.
మరోవైపు ఈ విమర్శలకు సుప్రీంకోర్టు కూడా దీటుగా బదులిచ్చింది. కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తీసుకురావచ్చని, ఇందుకు తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపైనా సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకున్నా సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొలీజియం స్థానంలో కొత్త వ్యవస్థ వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాల్సిందేనని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలంటూ కిరణ్ రిజిజు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.