టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాలు జరిగాయని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ విచారణను నిలిపేయాలని టీడీపీ హైకోర్టులో కేసు వేయడంతో సిట్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారణ పూర్తయింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదంటే ఎలా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఒకవేళ అలా లేదంటే అలాంటి వారికి వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్లు కాదా? అని ప్రశ్నించింది. ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదా? అని నిలదీసింది. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు సిట్ ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం చెబుతోందని.. దురుద్దేశం లేదని చెప్పేందుకు కావాలంటే సీబీఐకి ఇస్తామని చెప్పారు కదా? అని ప్రశ్నించింది. ఒకవేళ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలను వేధించాలనే దురుద్దేశం గనుక ఉంటే ఇవన్నీ దర్యాప్తులో తెలుస్తాయి కదా! అని ప్రశ్నించింది.
రాజకీయ విభేదాలు ఉన్నంతమాత్రాన గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదంటే ఎలా? అని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు సిట్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని న్యాయస్థానానికి నివేదించారు.
గత ప్రభుత్వ నిర్ణయాలపై కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకానీ ఏపీ ప్రభుత్వం నేరుగా కేసులు నమోదు చేయలేదని తెలిపారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందని అభిషేక్ సింఘ్వి గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని తెలిపే పలు తీర్పులను ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇక టీడీపీ తరపున వర్లరామయ్య తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. పక్షపాతంతో ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఆరోపించారు. వైసీపీ నేతలతో నిజనిర్దారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కలుగజేసుకుని.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని నిలదీసింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించకూడదా అని ప్రశ్నించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.