సుప్రీం మాటః ట్రిపుల్ త‌లాఖ్...ఉరిశిక్ష ఒక‌టే

Update: 2017-05-12 15:42 GMT
దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాఖ్‌ ఆచారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ విధానం రాజ్యాంగబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై చారిత్రాత్మక విచారణను ప్రారంభించిన సర్వోన్నత న్యాయస్థానం విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం పురుషులు తమ భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న ట్రిపుల్ తలాఖ్ పద్ధతి ఉరిశిక్ష లాంటిదేనని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. త‌లాఖ్ ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాకపోయినా ఇప్పటికీ దాన్ని అమలుచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇది పాపమే గానీ చట్టబద్ధమని చెప్పినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఇలా వ్యాఖ్యానించారు.

దేవుని దృష్టిలో పాప‌మైన చ‌ర్య‌, అది మ‌నిషి దృష్టిలో చ‌ట్టంగా మారుతుందా అని ఖేహ‌ర్‌ ప్ర‌శ్నించారు. మ‌తంలో ఉన్న ఓ అస‌హ్య‌క‌ర‌మైన అంశాన్ని చ‌ట్టంగా మార్చ‌వ‌చ్చా అని అడిగారు. అస‌లు ట్రిపుల్ తలాఖ్ అస‌హ్యక‌ర‌మైన సాంప్ర‌దాయ‌మా అని ప్ర‌శ్నించారు. చీఫ్ జ‌స్టిస్ ఖేహ‌ర్ కూడా ఆస‌క్తిర‌మైన ప్ర‌శ్న వేశారు. ట్రిపుల్ తలాఖ్ ఇస్లాం మతంలో సాంప్ర‌దాయ‌మా లేక ష‌రియ‌త్ చ‌ట్ట‌మా లేక సాధార‌ణంగా ఆ ప్ర‌క్రియ‌ను వాడుతున్నారా అని ఖేహ‌ర్‌ ప్ర‌శ్నించారు. ముస్లిం సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తి ఒక్క‌రికీ ట్రిపుల్ తలాఖ్ పై త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని స‌ల్మాన్ ఖుర్షీద్ అన్నారు.

ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తప్పుపట్టింది. ట్రిపుల్ తలాఖ్, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్లపై రెండో రోజు విచారణ జరిగింది. మూడుసార్లు తలాఖ్ చెప్పే పద్దతి ఘోరమైనదని సుప్రీంకోర్టు అభివర్ణించింది. పాక్‌ సహా పలు ముస్లిం దేశాల్లో ట్రిపుల్ తలాఖ్ ను అనుసరించట్లేదని న్యాయవాది ఖుర్షీద్‌ తెలిపారు. భర్త మాత్రమే తలాఖ్ చెప్పే పద్దతి సమానత్వ హక్కుకు విరుద్దమని న్యాయ‌వాది రామ్ రాంజెఠ్మలాని వాధించారు. ట్రిపుల్ తలాఖ్ అంటే భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14ను ఉల్లంఘించ‌డ‌మే అంటూ  జెఠ్మ‌లానీ ఈ సంద‌ర్భంగా అన్నారు. ఫోర‌మ్ ఫ‌ర్ అవేర్‌నెస్ ఆఫ్ నేష‌న‌ల్ సెక్యూర్టీ త‌ర‌పున జెఠ్మ‌లానీ వాదించారు. ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కూడా ఉల్లంఘించ‌డ‌మే అవుతోంద‌ని ఆయ‌న అన్నారు. ట్రిపుల్ తలాఖ్ అని విడాకులు ఇవ్వ‌డం ఒక్క మ‌గ‌వారి చేతిలోనే ఉంటుంద‌ని, మ‌హిళ‌ల‌కు త‌మ అభిప్రాయాలు చెప్పుకునే ప‌రిస్థితి లేద‌ని జెఠ్మ‌లానీ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News