ఏపీలో స్థానిక ఎన్నికలు.. సుప్రీంలో జగన్ కు నిరాశ

Update: 2020-03-17 04:45 GMT
కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక చంద్రబాబు, ఆయన లాబీయింగ్ కుట్ర ఉందని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టు ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహరించి ఎన్నికలు వాయిదా వేశాడని మండిపడ్డారు. అంతే కాకుండా ఈ నిర్ణయం పై జగన్ సర్కారు తాజాగా సోమవారం సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది.

దీనిని సుప్రీం ధర్మాసనం లిస్ట్ చేసి మంగళవారం విచారిస్తామని ప్రకటించింది. అయితే సోమవారం సాయంత్రం సుప్రీం కోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రేపు లిస్ట్ చేసిన ఏ కేసును విచారణ చేపట్టడం లేదని బాంబు పేల్చారు.

కరోనా వైరస్ కారణంగా అత్యవసర కేసులు మినహా అన్ని కేసుల విచారణను సుప్రీం వాయిదా వేసింది. అత్యవసర కేసుల విచారణ కోసం ఆరు బెంచ్ లను మాత్రమే ఏర్పాటు చేసింది. తాజాగా మంగళవారం ఆ బెంచ్ లలో విచారణ కూడా నిలిపివేసింది.

ఇక ఏపీ హైకోర్టులో కూడా కొందరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పిటీషన్ వేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటీషన్ ఉండడంతో ఈనెల 19వరకు హైకోర్టులో పిటీషన్ వాయిదా వేశారు.

ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న జగన్ సర్కారుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల పిటీషన్ కరోనా కారణంగా హోల్డ్ లో పడడంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది.
Tags:    

Similar News