తనపై నమోదైన ఓ కేసుకు సంబంధించిన విచారణను సీబీఐకి బదిలీ చేయాలని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించి షాక్ ఇచ్చింది. సీబీఐకి అప్పగించలేమని తేల్చి చెబుతూ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగించడానికి మంగళవారం అనుమతించింది. అతడికి మరో మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని మాత్రం ముంబై పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.
వాస్తవంగా పాల్ఘర్ మూకదాడికి సంబంధించి అర్నాబ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో అర్నాబ్ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ క్రమంలో విచారణ చేసి సుప్రీంకోర్టు అన్ని కేసులపై స్టే విధించింది. అయితే నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై స్టే విధించకుండా ముంబైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. ఇప్పుడు దానిపై సుప్రీంకోర్టు విచారణ చేసింది.
సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాఖలైన కేసుకు సంబంధించి ముంబై పోలీసులు 12 గంటలపాటు విచారించారని తెలిపారు. తనను విచారించిన ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని అన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంను ఆశ్రయించింది. అర్నాబ్ తనకు సుప్రీం ఇచ్చిన రక్షణను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. పోలీసుల్లో భయాందోళన కలిగించేలా అర్నాబ్ తీరు ఉందని.. కేసుపై అతని ప్రభావం పడకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మరోవైపు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు గుమిగూడటంపై ప్రసారం చేసిన కథనానికి సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని వేసిన క్వాష్ పిటిషన్ కూడా సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.