జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేసిన సుప్రీం

Update: 2017-04-28 08:44 GMT
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విభేదించింది. సీబీఐ వాదనను తోసిపుచ్చి, బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసింది. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలో జగన్ హస్తం ఉంటుందని భావించడం లేదని, ఎడిటోరియల్ బోర్డు నిర్ణయానికి, జగన్ కు సంబంధం ఉంటుందని భావించడం లేదని తెలిపిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టేసినట్టు ప్రకటించింది.
    
కాగా, జగన్ బెయిల్ రద్దువుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిన నేపథ్యంలో...న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వెలువరించడం జగన్ తో పాటు వైఎస్సార్సీపీకి గొప్ప ఊరట లభించినట్టైంది.
    
అంతేకాదు... బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్ ను కొట్టివేయడమే కాక... అతని న్యూజిలాండ్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే న్యూజిలాండ్ కు సింగిల్ గా వెళ్లకూడదని, కుటుంబసభ్యులతో కలసి వెళ్లాలని కోర్టు షరతు విధించింది. మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ మధ్యలో న్యూజిలాండ్ కు వెళ్లవచ్చని సూచించింది. 15 రోజుల పాటు న్యూజిలాండ్ వెళ్లవచ్చని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News