చెత్త కుప్పల్లో శవాలు...రోగుల శవాలంటే లెక్కలేదా : సుప్రీం

Update: 2020-06-12 13:00 GMT
భారత్‌ లో ఈ మహమ్మారి విలయ తాండవం కొనసాగుతుంది. రోజుకు సరాసరిగా 10 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత భయంకరంగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. కరోనా రోగులకు చికిత్స, పరీక్షల తీరు, అంత్యక్రియ నిర్వహణపై శుక్రవారం సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లను పశవుల కంటే హీనంగా చూస్తున్నారని.. మృతదేహాలు చెత్త కుప్పల్లో కనిపిస్తున్నాయని మండిపడింది. మృతదేహాల నిర్వహణ సరిగ్గా లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌ వాపోయారు. ఢిల్లీలో పరిస్థితితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మరణాల గురించిన సమాచారమే ఇవ్వడంలేదని, కొన్ని సందర్భాల్లో కుటుంబాలు చివరి చూపుకు కూడా నోచుకోవడంలేదని విచారం వ్యక్తం చేసింది.

ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ.. వైరస్ డెడ్ బాడీలను పేషెంట్ల వెయిటింగ్ ఏరియాలో వదిలివేశారని రిపోర్టులు చెప్తున్నాయని, కరోనా ప్రొటోకాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఢిల్లీ సర్కారు పాటించడం లేదని సీరియస్ అయింది. ఢిల్లీలో వైరస్ పరీక్షలు తగ్గడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వైరస్ వచ్చిన ప్రారంభంలో పరీక్షల చేయడంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నదని.. కానీ ఆ తర్వాత క్రమంగా టెస్ట్‌ల సంఖ్య తగ్గిందని వెల్లడించింది. కేసుల పెరిగికొద్దీ టెస్ట్‌ల సంఖ్య కూడా పెరగాలని.. కానీ ఢిల్లీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దేశ రాజధానిలో ఇప్పటివరకు 34,687 మంది వైరస్ బారిన పడగా 1,085 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Tags:    

Similar News