జడ్జిని మార్చాలా? ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చీవాట్లు

Update: 2020-12-16 02:30 GMT
ప్రముఖ నటి కిడ్నాప్, దాడి కేసు విచారణ జరుగుతున్న కోర్టు న్యాయమూర్తిని మార్చాలని కేరళ ప్రభుత్వం చేసిన మనవిని సుప్రీంకోర్టు తిరస్కరించడం సంచలనమైంది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాదించిన కేరళ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది.

మీరు చెప్పినంత మాత్రాన మార్చమని.., మీ డిమాండ్ లకు జడ్జిని మార్చడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది, అసలు మీరు ఏమనుకుంటున్నారు ? మీ వాదనలను మీరే సమర్థించుకుంటారా అంటూ సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వంపై మండిపడి పిటిషన్ ను కొట్టి వేసింది.

2017లో ఫిబ్రవరి నెలలో కేరళలోని త్రిసూర్ నుంచి కారులో కొచ్చి వెళుతున్న ప్రముఖ నటిని కొందరు కిడ్నాప్ చేసి దాడి చేశారు. కేరళతోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, దాడి కేసు కలకలం రేపింది. ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, దాడి కేసులో మలయాళం సినీ రంగంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దిలీప్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం అప్పట్లో కలకలం రేపింది. పల్సర్ సునీ అండ్ గ్యాంగ్ తో పాటు స్టార్ హీరో దిలీప్ జైలుపాలైనాడు. సుమారు 80 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన హీరో దిలీప్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.

ఈ సందర్భంలోనే ప్రముఖ నటి కిడ్నాప్ కేసు, దాడి కేసును హీరో దిలీప్ ప్రభావితం చేస్తున్నాడని.. సాక్ష్యులను బెదిరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో న్యాయమూర్తిని మార్చాలని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా చీవాట్లు పెట్టింది.
Tags:    

Similar News