బ్రేకింగ్: టపాసులు కాల్చడంపై సుప్రీం కీలక ఆదేశం

Update: 2020-11-13 15:30 GMT
సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బాణాసంచా కాల్చడంపై నిషేధాన్ని విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై తాజాగా తీర్పును ఇచ్చింది.

తెలంగాణలో బాణసంచా కాల్చడం.., విక్రయంపై నిషేధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టు సవరించింది. గాలి, నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపజేస్తున్నట్లు తెలపింది.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ఫైర్ వర్స్క్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఖాన్ విల్కర్ నేత్రుత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంటే తెలంగాణలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నచోట టపాసులు కాల్చవద్దని, సాధారణ ప్రదేశాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్ కాకర్స్ కు అనుమతినిచ్చింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఎన్జీటి మార్గదర్శకాలను అమలు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Tags:    

Similar News