అర్నాబ్ ‌కి మధ్యంతర బెయిల్‌ మంజూరు !

Update: 2020-11-11 17:31 GMT
ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామికి మధ్యంతర బెయిల్‌ వచ్చింది. అర్నాబ్ ‌తో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, ఈ కేసులో ఈ నెల 4వ తేదీన అర్నబ్ గోస్వామిని ముంబై్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇంట్లో ఉన్న అతడిని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అర్నబ్ ‌కు నవంబర్‌ 18 వరకు రాయిగఢ్‌ జిల్లా కోర్టు జ్యుడిషియల్‌ కస్టడి విధించింది.

ఇక మధ్యంతర బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అర్నాబ్‌ సుప్రీం కోర్టు తపులు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్‌‌ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. 2018లో అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్ అతని తల్లి ఆత్మహత్య కేసులో అర్నబ్ గోస్వామితో పాటు మరో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News