2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లపై బీబీసీ ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీ రూపొందింది. భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే ఈ డాక్యుమెంటరీపై కేంద్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక విద్వేష పూరిత చర్యగా అభివర్ణించిన సంగతి తెల్సిందే..!
ఈ క్రమంలోనే ఈ డాక్యుమెంటరీని నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే బీబీసీ డాక్యుమెంటరీని చూసే పౌరులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందని.. దీనిపై నిషేధం విధించడం భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధమని సీనియర్ జర్నలిస్టు రామ్.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. సామాజిక కార్యకర్త.. న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. మరో న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
శుక్రవారం ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డును కోర్టుకు సమర్పించాలని సుప్రీం కేంద్ర ప్రభుత్వంతో పాటు మరికొందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి కోర్టు విచారణ నాటికి బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులకు సమర్పించాలని స్పష్టం చేసింది. కాగా "ఇండియా : ద మోదీ క్వశ్చన్" పేరిట బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్ ను ఆ సంస్థ యూట్యూబ్.. ట్విటర్లో అందుబాటులో ఉంచడంతో వివాదం రాజుకుంది.
బీబీసీ డాక్యుమెంట్ కాస్త వివాదాస్పద కావడంతో కేంద్రం ఈ లింకులను వెంటనే తొలగించిన గత నెల 21న ఆయా సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ డాక్యుమెంటరీపై బీజేపీ వర్గాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.